జగన్ డిసైడ్ ..! చంద్రబాబు హయాంలో అవినీతిపై విచారణకు కేబినెట్ సబ్ కమిటీ..!

చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికి కేబినెట్ సబ్ కమిటీని నియమించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మొత్తం 30 అంశాలపై విచారణ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల సహకారాన్ని.. కేబినెట్ సబ్ కమిటీ తీసుకుని అవినీతిని వెలికి తీయాలని జగన్ నిర్ణయించారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు.. కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. విద్యుత్ రంగంపై జగన్ మోహన్ రెడ్డి జరిపిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ రంగంలో.. గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని.. జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.

సోలార్, విండ్‌ పవర్‌ కొనుగోళ్లలో కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ రేట్లకన్నా అధిక రేట్లకు కొనుగోలు చేశారని.. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.2, 636 కోట్లు నష్టం వాటిల్లిందని జగన్ తేల్చారు. ఈ డబ్బును రికవరీ చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టులు పొందిన కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సోలార్, విండ్‌ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దుచేయాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దని.. ఉన్నతాధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి ఉన్నా సరే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నిజానికి… జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు నుంచీ.. విద్యుత్ కొనుగోలు పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కేంద్రం నుంచి.. ఏపీ సర్కార్‌కు ఓ లేఖ కూడా వచ్చింది. అలాంటి ప్రకటనలు చేయడం వల్ల.. పెట్టుబడిదారులు.. భయపడతారని… ధరల నిర్ణయానికి ఓ ప్రక్రియ ఉంటుందని.. బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయవద్దని… ఆ లేఖలో సూచించారు. అయితే.. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి పట్టు వీడలేదు. ప్రధాని తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు.. ఈ లేఖ అంశాన్ని ప్రస్తావించి.. విచారణ జరిపించేందుకు అనుమతి తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే.. తొలి కేబినెట్‌లోనే విచారణ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు.. సబ్ కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు.

2004లో చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు.. వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కూడా.. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని.. పలు సబ్ కమిటీలను.. నియమించారు. అయితే.. ఆ కమిటీ నివేదికల్లో ఏమీ తేలలేదు. దీనిపై టీడీపీ నేతలు తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా… కేబినెట్ సబ్ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. మరి అవినీతి సంగతి తేలుస్తారో లేదో ..!?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close