చిన్న విషయాలు లైట్..! చిరు ఫ్యామిలీకి చిక్కులు..!

మెగా ఫ్యామిలీ.. చిన్న చిన్న విషయాల పట్ల.. నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. వాటి గురించి ప్రజల్లోకి తప్పుడు ప్రచారం వెళ్లిపోతోంది. ఉయ్యాలవాడ వంశస్తులు.. రామ్ చరణ్ ఇంటి ముందు ధర్నా చేయడం.. ఒక్క సారిగా హాట్ టాపిక్ అయింది. వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తూ.. ఆ సినిమా కథకు మూలం అయిన వారిని.. చిన్న చిన్న విషయంలో.. చీట్ చేశారన్న అభిప్రాయం దీని వల్ల ఏర్పడిపోయింది. అసలేం జరిగిందో.. ఆ చిత్ర వర్గాలు.. చెప్పినా… ధర్నా చేసిన వాళ్ల వెర్షనే ఎక్కువగా.. ప్రజల్లోకి వెళ్లిపోతుంది. దీంతో.. మెగా ఫ్యామిలీకి మరకలు తప్పడం లేదు.

ఉయ్యాలవాడ వంశీకులతో గొడవ తీర్చుకోలేరా..?

నిజానికి.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్తులకు… సైరా సినిమా యూనిట్ కు మధ్య ఉన్నది కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని.. సినిమా వర్గాలు చెబుతున్నాయి. సైరా సినిమాను తీయాలనుకున్నప్పుడు.. ఆ చిత్ర యూనిట్… కొన్ని విషయాల కోసం వారిని సంప్రదించింది. మొదట్లో.. వారు.. కొన్ని విషయాల మీద అభ్యంతరం వ్యక్తం చేసినా.. తర్వాత సద్దుమణిగిపోయింది. అయితే.. ఈ పరిస్థితిని ఇలాగే.. కొనసాగించడంలో.. సైరా యూనిట్ విఫలమయింది. వారికిచ్చిన హామీలను అమలు చేయడంలో… నిర్లక్ష్యం చూపించారు. నిజానికి అంత పెద్ద సినిమా అదీ కూడా.. చిరంజీవి హీరోగా వస్తున్నప్పుడు.. దానిపై ఎలాంటి వివాదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యూనిట్ పై ఉంది. వారి వెర్షన్‌ను బట్టి ఇదేమీ అంత పెద్ద వివాదం కాదు. సింపుల్‌గా తేలిపోయేదే. కానీ.. పట్టించుకోవకపోవడం వల్ల.. వివాదం పెరిగి పెద్దదయింది. దీంతో.. మెగా ఫ్యామిలీ.. ఇలాంటిదా అన్న చర్చ బయటకు వచ్చేస్తోంది.

లైబ్రరీ చేసిన డ్యామేజ్ గుర్తు లేదా..?

గతంలో.. కూడా.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు… ఓ లైబ్రరీ విషయంలో.. ఇలాగే రచ్చ అయిపోయింది. అది ఎంతగా డ్యామేజ్ చేసిందంటే… పాలకాల్లులలో చిరంజీవి ఓడిపోవడానికి అది కూడా ఓ కారణం అని అనుకున్నారు. కొణిదెల కుటుంబం స్వస్థలం… మొగల్తూరులో..వారికి ఓ ఇల్లు ఉందని… పెంకుల కప్పు ఉండే.. ఆ ఇల్లు ఆలనాపాలనా లేకుండా పడి ఉందని.. దాన్ని లైబ్రరీకి ఉపయోగించుకుంటామని.. అడిగినా… మెగా సోదరులు ఇవ్వలేదన్న ప్రచారం జరిగింది. చిరంజీవి తండ్రి పేరు మీదే లైబ్రరీ పెడతామని చెప్పినా.. ఉమ్మడి ఆస్తి కాబట్టి.. ఇవ్వలేమని చెప్పినట్లు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లింది. తర్వాత దాన్ని అమ్మేశారని కూడా చెప్పుకున్నారు. మహా అయితే.. రూ. రెండులక్షలు మాత్రమే చేసే ఆ ఇంటిని కూడా… లైబ్రరీ కోసం మెగా ఫ్యామిలీ ఇవ్వలేదన్న ప్రచారం జరగడంతో… ఎన్నికల్లో నెగటివ్ అయింది. దీన్ని మెగా కుటుంబం ఎన్ని సార్లు ఖండించినా.. ఆ ప్రచారం అలా సాగుతూనే ఉంది.

చిన్న చిన్న వివాదాలతోనే ఇమేజ్ తేడా..!

ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం. అసలు నిజం కన్నా.. ఫేక్ న్యూస్ ముందుగా వెళ్లిపోతుంది. పైగా ఇప్పుడు… మెగా కుటుంబం నుంచి పవన్ కల్యాణ్ రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఆయనను టార్గెట్ చేస్తూ.. నిందలు వేయడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. ఇలాంటి సమయంలో… మెగా కుటుంబం.. చిన్న చిన్న వివాదాల పట్ల మరింత సీరియస్‌గా ఉండాలన్న అభిప్రాయం అభిమానుల్లో ఉంది. లేకపోతే.. బ్యాడ్ ఇమేజ్.. అలా కొనసాగుతూనే ఉంటుందని.. ఆవేదన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపు అనేదే లేదా ? ఆఫీసర్లకు పేర్ని నాని హెచ్చరిక

వైసీపీ నేతల ఆర్తనాదాలు పీక్స్ కు చేరుతున్నాయి. ఎంతగా అంటే.. చివరికి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి.. ఏ ఒక్కరినీ వదలం.. రేపు అనేది లేదనుకుంటున్నారా అని మండిపడ్డారు. ఎవరిపైన అంటే.....

ఏబీవీకి పోస్టింగ్ – తెర వెనుక చాలా జరిగింది !

ఏబీవీకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటించాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. కానీ రాత్రికి రాత్రి సీన్ మారిపోయింది. తెల్ల వారే సరికి ఆయన సస్పెన్షన్ ఎత్తివేయడం, పోస్టింగ్ ఇవ్వడం , రిటైర్మెంట్...

సజ్జలపై క్రిమినల్ కేసు… పోలీసులకు ఆ ధైర్యం ఎక్కడిది..?

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అలా ఫిర్యాదు అందిందో లేదో, ఇలా కేసు నమోదు కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐదేళ్లుగా వ్యవస్థలన్నింటిని కనుసైగలతో శాసించిన సజ్జలపై కేసు. అదీ క్రిమినల్ కేసు...

సినిమా థియేట‌ర్ల‌లో ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్స్

అవును... మీరు చ‌దివింది నిజ‌మే. మూవీ థియేట‌ర్ల‌లో ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్స్ టెలికాస్ట్ చేయ‌బోతున్నారు. దేశ‌వ్యాప్తంగా ఎవ‌రు గెలుస్తారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? మోడీ ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారం చేప‌డ‌తారా..?...

HOT NEWS

css.php
[X] Close
[X] Close