సందీప్ సినిమాలో సుధీర్‌

యువ హీరోలు తెలివిగా ఆలోచిస్తున్నారు. నాలుగు డ‌బ్బులు ఉండ‌గానే ఇల్లు చ‌క్క బెట్టుకోవాల‌నుకుంటున్నారు. దాదాపు ప్ర‌తీ హీరోకీ ఓ సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఉంది. సుధీర్ బాబు, సందీప్ కిషన్ ఇద్ద‌రూ ఇటీవ‌లే సొంత సంస్థ‌లు స్థాపించారు. వెంక‌టాద్రి ప్రొడ‌క్ష‌న్ పేరుతో సందీప్ కిష‌న్ ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. సుధీర్ బాబు కూడా త‌న ప్రొడ‌క్ష‌న్‌లో సినిమా ఇది వ‌ర‌కే తీసేశాడు. అయితే వీరిద్ద‌రూ ఇప్పుడో మాట ఇచ్చి పుచ్చుకున్నారు. సందీప్ నిర్మాత‌గా సుధీర్ ఓ సినిమా చేయ‌డానికి, సుధీర్ నిర్మాత‌గా సందీప్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమా చేయ‌డానికి ఫిక్స‌య్యారు. అంతే కాదు… మ‌రో యువ హీరో నిఖిల్ వీరిద్ద‌రి ప్రొడ‌క్ష‌న్‌లో ఫ్రీగా సినిమా చేస్తాన‌ని మాట ఇచ్చాడు. మ‌రో విశేషం ఏమిటంటే.. ఈ ముగ్గురూ క‌ల‌సి ఓ సినిమా చేయ‌బోతున్నార్ట‌. ఇవ‌న్నీ జ‌రిగే విష‌యాలో కావో తెలీదు గానీ `నిను వీడ‌ని నీడ‌ను నేనే` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో మాత్రం ఈ ముగ్గురూ ప్రామిస్ చేసుకున్నారు. “సందీప్ మా అంద‌రికీ చాలా స్ఫూర్తి ఇచ్చాడు. ఒక‌ట్రెండు ఫ్లాపులు నాకొస్తే.. నేను డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోతాను. కానీ సందీప్ అందులోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఓ సాహ‌సోపేత‌మైన అడుగు వేశాడు. నాకెప్పుడైనా వ‌రుస ఫ్లాపులు వ‌స్తే సందీప్‌ని గుర్తు చేసుకుంటాను. త‌న ప్రొడ‌క్ష‌న్‌లో నాకో సినిమా చేయాల‌నివుంది“ అన్నాడు సుధీర్ బాబు. వెంట‌నే మైకు అందుకున్న సందీప్ ”సుధీర్ నిర్మాత‌గా నేనో సినిమా చేస్తా.. నా బ్యాన‌ర్‌లో సుధీర్ చేస్తాడు” అని కొన‌సాగించాడు. వీరిద్ద‌రి మ‌ధ్య‌లో వ‌చ్చి నిఖిల్ ”మీ ఇద్ద‌రి బ్యాన‌ర్‌లో నేను ఫ్రీగా చేస్తా” అని చెప్పేశాడు. మొత్తానికి యువ హీరోల మ‌ధ్య ఐక‌మ‌త్యానికి ఈ వేడుక మ‌రోసారి సాక్షిగా నిలిచింది. నిజంగా ఈ కాంబినేష‌న్ వ‌స్తే బాగుంటుంది క‌దా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close