ఆదిత్య 369 ఫార్ములా వాడేశారా?

తెలుగు సినిమాకి సంబంధించినంత వ‌ర‌కూ `ఆదిత్య 369` ఓ వినూత్న ప్ర‌యోగం. భూత‌, భ‌విష్య‌త్‌, వ‌ర్త‌మానాల్ని సింగీతం చూపించిన విధానం అబ్బుర ప‌రిచింది. అలాంటి సినిమా మ‌రోసారి తీయాల‌ని చాలా మంది ప్ర‌య‌త్నించారు. కానీ… ఎవ్వ‌రూ స‌క్సెస్ కాలేదు. సీక్వెల్‌గా `ఆదిత్య 999` చేయాల‌ని బాల‌య్య – సింగీతం కూడా అనుకున్నారు. కానీ అదీ వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. కానీ… ఈ ఫార్ములాని సందీప్‌కిష‌న్ వాడేశాడు. త‌న కొత్త సినిమా `నిను వీడ‌ని నీడ‌ను నేనే`లో.

ఇది కూడా భూత – భ‌విష్య‌త్ – వ‌ర్త‌మానాల కాన్సెప్ట్ ప్ర‌కార‌మే సాగ‌బోతోంది. రాగ‌ల 20 ఏళ్ల‌లో ఎలాంటి సాంకేతిక మార్పులొస్తాయి? స‌మాజం, మ‌నుషులు ఎలా మారిపోతారు అనే విష‌యాన్ని ఇందులో చూపిస్తున్నారు. సినిమా మొద‌లైన ప‌ది నిమిషాల‌కే ఫ్యూచ‌ర్‌లోకి తీసుకెళ్ల‌బోతున్నారు. ఆ సన్నివేశాల కోసం విజువ‌ల్ ఎఫెక్ట్స్ అవ‌సరం ఏర్ప‌డింది. చిత్ర ద‌ర్శ‌కుడికి ఇది వ‌ర‌కే విజువ‌ల్ ఎఫెక్ట్స్ విభాగంలో నైపుణ్యం ఉంది. అందుకే ఆ సీన్స్ అన్నీ బాగా వచ్చాయ‌ని టాక్‌. 20 ఏళ్ల ముందుకే కాదు, 20 ఏళ్ల వెన‌క్కి కూడా తీసుకెళ్ల‌బోతోంది చిత్ర‌బృందం. ఈ క‌థ‌లోనే హార‌ర్‌, ఫాంట‌సీ అంశాలు మిక్స్ చేశారు. ఈ సినిమాలో చాలా ర‌కాలైన జోన‌ర్లున్నాయ‌ని సందీప్ ముందునుంచీ చెబుతూనే ఉన్నాడు. ఇన్నిర‌కాల ప్యాకేజీలు క‌ల‌గ‌లిపి సందీప్‌కి హిట్టు తీసుకొస్తాయేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close