రివ్యూ: నిను వీడని నీడను నేనే

తెలుగు360 రేటింగ్‌: 2/5

దెయ్యాల సినిమాలకు లాజిక్కులు వుండవు అన్నది తెలుగు సినిమాలు ఎప్పుడో రాసి పెట్టిన రాజ్యాంగం.

కానీ హర్రర్ కామెడీ సినిమాలు, ప్యూర్ హర్రర్ సినిమాలు తెగ తీసేసారు..చూసేసారు. అందుకే ప్రేక్షకులకు సైంటిఫిక్ హర్రర్ సినిమా చూపిద్దాం అనుకున్నాడు హీరో కమ్ నిర్మాత సందీప్ కిషన్. అయితే ఇక్కడ కూడా దెయ్యాల సినిమాలకు లాజిక్కులుండవు అన్న కండిషన్ అప్లయ్ అన్నది మాత్రంం కామన్.
తెల్లవారి అద్దంలో మొహం చూసుకోగానే మనకి మన ముఖము కాకుండా, వేరే వాళ్ల ఫేస్ కనిపిస్తే ఎలా వుంటుంది? మనకే కాదు, మనని అద్దంలో చూసేవారికి కూడా వేరే వాళ్లు కనిపిస్తే ఎలా వుంటుంది?

ఈ ఒక్క ఆసక్తికరమైన పాయింట్ చుట్టూ అల్లుకున్న కథే ‘నిను వీడని నీడను నేనే’ రిషి (సందీప్ కిషన్) దివ్య (అన్య సింగ్) కొత్తగా పెళ్లయిన జంట. ఉన్నట్లుండి ఓ రోజు నుంచి వారికి అద్దాల్లో వేరే వాళ్ల ఫేస్ లు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ సమస్య పరిష్కారం గురించి కిందా మీదా అవుతుంటే, అసలు వైనం బయటపడుతుంది. అదేంటీ, ఈ సమస్య ఎలా పరిష్కారం అయింది అన్నది అసలు సినిమా.

ఓ వైవిధ్యమైన పాయింట్ చుట్టూ ఆసక్తికరమైన కథనం అల్లుకోవడం వరకు దర్శకుడు కార్తీక్ రాజు ఓకె అనిపించుకున్నాడు. అయితే ఆ పాయింట్ చిన్నది కావడంతో, రెండు గంటలు ఫిల్ చేయడం అంత బాగా సాధ్యం కాలేదు. చాలా సినిమాలకు వచ్చే సమస్యనే ఈ సినిమాకూ వచ్చింది. ఎత్తుగడ వరకు బాగానే అల్లేసుకుంటారు కథను. అలాగే క్లయిమాక్స్ ను ముందే రెడీ చేసుకుంటారు. అయితే ఈ ఎత్తుగడకు, ఆ క్లయిమాక్స్ కు మధ్య ఫిల్లింగ్ తోనే వస్తుంది తంటా. అక్కడే చాలా మంది బోర్లా పడుతుంటారు. ఇక్కడా అదే జరిగింది.

సినిమా తొలిసగం టేకింగ్ సాదా సీదాగానే వుంటుంది. తొలి పది నిమషాలు చాలా సాదాగా వుంటుంది. కానీ కథ టేకాఫ్ తీసుకుని, విశ్రాంతి వరకు బాగానే వెళ్తుంది. అనవసరపు సీన్లు పెద్దగా వుండవు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగానే వుంటుంది. కానీ సినిమా మలిసగంలోకి ప్రవేశించాక అసలు సమస్యలు మొదలవుతాయి.

ఇక్కడ నుంచి సినిమాను వెన్నెలకిషోర్ జంట మీద నడిపించాల్సి వుంటుంది లెక్కప్రకారం, కథ ప్రకారం, లాజిక్ ప్రకారం. కానీ హీరో సందీప్ కిషన్ కాబట్టి, ఏదో ఒక సాకు లాంటి లాజిక్ చెప్పి అతని మీదే నడిపిస్తారు. దాంతో ప్రేక్షకుడికి ఎక్కడ తెలియని చిన్న అయోమయం, ప్లస్ వెలితి ఏర్పడుతుంది. ఇలాంటి టైమ్ లో ముందే చెప్పుకున్న ఫిల్లింగ్ సమస్య వస్తుంది. దర్శకుడు ఇక్కడే పెద్ద తప్పు చేసాడు. హీరో ఫ్లాష్ బ్యాక్, లవ్, రొమాన్స, పెళ్లి గొడవలు అన్నీ పట్టుకువచ్చాడు. ఇలాంటి జోనర్ సినిమాకు, అందులోనూ షార్ట్ గా, ఫాస్ట్ గా, ఆసక్తికరంగా వెళ్లాల్సిన టైమ్ లో అలాంటి వ్యవహారాలు చొప్పించడం, కథనాన్ని బలంగా పట్టుకుని కిందకు లాగేసాయి. అలాగే ఫన్ పేరుతో చేసిన రెండు మూడు నిమషాల చిన్న షార్ట్ రన్ స్కిట్ లు కూడా అలాగే వున్నాయి.

సినిమా ముగింపు ఇదే, ఇలాగే వుంటుంది, తప్పదు అని చూసే ప్రేక్షకుడి ఊహకు అందుతూనే వుంటుంది. అలాగే మేకర్లకు తెలుసు. కానీ కేవలం అలా ఎండ్ చేస్తే చప్పగా వుంటుంది. అందుకే ఎమోషనల్ ఎండింగ్ ఇవ్వాలని డిసైడ్ కావడం వరకు బాగానే వుంది. కానీ ఆ డోస్ ఏ మేరకు, ఆ ఎమోషనల్ సీన్లలో నటిస్తున్న నటులు ఎవ్వరు అన్నది కూడా చూసుకోవాలి. అంత బలమైన సన్నివేశాలు వుంటాయి అనుకున్నపుడు అందుకు తగిన నటులను,కాస్త పరిచయం అయిన, పరిణితి కలిగిన నటులను తీసుకోవాలి. అలా కాకుండా ఎవ్వరో తెలియని మొహాలను తీసుకువచ్చి, పది పదిహేను నిమషాల పాటు వారి ఫేస్ ల మీద ఎమోషన్ సీన్లు తీయడం, కెమేరా ఫోకస్ చేయడం అంటే అనుభవరాహిత్యం అనుకోవాల్సిందే. హీరో హీరోయిన్ల మధ్య భావోద్వేగ సన్నివేశాల వరకు షార్ప్ గానే వున్నాయి. కానీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికే తేడా వచ్చి, సినిమా గ్రాఫ్ దిగిపోయింది.

ఇక్కడ కూడా దెయ్యాల సినిమాలకు లాజిక్కులుండవు అన్న సూత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే దెయ్యాలకు ప్రేమలు, భావోద్వేగాలు ఏమిటో? అయినా రెండు శరీరాలు దొరికాయి. వాళ్లు కూడా మంచివాళ్లే, టూ కోపరేటివ్ కదా? ఏదో అలా కలిసి ‘సహజీవనం’ చేసుకుంటూ వుండిపోతే పోలా? అని జోకులు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు హీరోయిన్లు అద్దంలో కలుసుకుని కులాసా కబుర్లు చెప్పేసుకుంటూ వుంటారు. హీరోలు జోకులేసుకుంటూ వుంటారు.

ఆ మాత్రం దానికి ఈ తరహా ఎమోషనల్ ఎండింగ్ ఎందుకో?

మొత్తం మీద సినిమాను కేవలం సందీప్ కిషన్ మీదే దాదాపుగా లాగించేసారు. వెన్నెల కిషోర్ తన వంతు తాను ఒకె. హీరోయిన్ సినిమాకు ఏమంత ప్లస్ కాదు. పోసాని తరహా కామెడీ మామూలే. తక్కువ బడ్జెట్ లో నైనా సినిమా మేకింగ్ క్వాలిటీ బాగానే వుంది. ధమన్ ను కేవలం నేఫధ్యసంగీతం కోసం పెట్టుకున్నారేమో? పాటలు ఏమంత క్యాచీగా లేవు. హీరో సిద్దార్థపాడిన పాటతో సహా.

ఇలాంటి సినిమాలకు ఇంకో సమస్య కూడా వుంటుంది. అసలు పాయింట్ కాస్తా, మార్నింగ్ షో తరువాత రివీల్ అయిపోతుంది. అందువల్ల థ్రిల్ వుండదు, ఆసక్తి కలగడానికి చాన్స్ తక్కువ. ఇలాంటి పాయింట్ తో సినిమా ప్లాన్ చేయడం వరకు ఓకె,. కానీ దాని నుంచి కాస్త ఫన్, మరికాస్త థ్రిల్ తీసుకురాగలిగితేనే వర్కవుట్ అవుతుంది. లేదూ అంటే ఈ సినిమాలా వుంటుంది.

ఫినిషింగ్ టచ్…..అద్దంలో ముఖంలా వుంది

తెలుగు360 రేటింగ్‌: 2/5

–శ్రీవత్స

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close