కర్ణాటకంపై సుప్రీం తీర్పు ఎవరికి “బలం.”.?

కర్ణాటక అసెంబ్లీలో రేపు బలపరీక్ష జరగనుంది. ఈ క్రమంలో … బీజేపీ, కాంగ్రెస్ వ్యూహకర్తలు బెంగళూరులో మకాం వేశారు. సుప్రీంకోర్టు … రెండు పార్టీలు తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులో ప్రధానంగా రెండు అంశాలున్నాయి. ముంబైలో బస చేసిన రెబెల్ ఎమ్మెల్యేలకు కోర్టు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. విధిగా సభకు హాజరు కావాలని వారిని నిర్బంధించలేమని, సభకు రావాలా వద్దా అన్నది వారిష్టమని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఇది రెబెల్స్ కు పూర్తి ఉరటేనని భావిస్తున్నారు. సభకు గైర్హాజరు కావడం ద్వారా కుమారస్వామి ప్రభుత్వాన్ని మైనార్టీలో పడెయ్యాలన్న వారి ఆలోచన నెరవేరే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

స్పీకర్‌కు ఇబ్బంది కలిగే తీర్పు వస్తుందని ఎదురు చూసిన వారికి నిరాశ తప్పలేదు. నిర్దిష్ట కాలపరిమితిలో రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది.రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారంలో నిర్ణయాన్ని స్పీకర్ రమేష్ కుమార్‌కు వదిలేస్తున్నట్లు ప్రకటించింది. ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అప్పుడే ..!. అయితే.. సుప్రీంకోర్టు.. ఎమ్మెల్యేలను.. బలపరీక్షకు వెళ్లాలా వద్దా.. అన్నది వారిష్టమని… బలవంతం చేయలేరని.. తీర్పు చెప్పింది. దీంతో.. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేరనే వాదన బీజేపీ తెరపైకి తీసుకు వచ్చిది. వాళ్లు సభకు హాజరు కావాలన్న నిబంధన లేదని .. కుమారస్వామి ప్రజా మద్దతు కోల్పోయారు సభలో మెజార్టీ నిరూపించుకోలేకపోతే ఆయన రాజీనామా చేయాల్సిందేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. నిర్ణయం విషయంలో స్పీకర్‌కు సంపూర్ణ అధికారాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విప్ విషయంలో… సుప్రీం తీర్పు అన్వయంతో.. భవిష్యత్తులో స్పీకర్ అధికారాలను సుప్రీం కోర్టు నిర్ణయిస్తుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొత్త ట్రెండ్‌కు తెరలేస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

మరో వైపు.. అసెంబ్లీలో ఎవరి బలాలు ఎంత అన్నదానిపై చర్చ జరుగుతోంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలున్నాయి. ఇందులో బీజేపీ-105, కాంగ్రెస్-78, జేడీఎస్‌కి 37 స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 113. ప్రస్తుతం కాంగ్రెస్-జేడీఎస్‌లకు 115 మంది ఎమ్మెల్యేలున్నారు. బీఎస్పీ, ఇద్దరు స్వతంత్రులు, నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి ఆ బలం 119కి పెరిగింది. ఐతే, 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సర్కార్ మైనార్టీలో పడింది. వారు సభకు రాబోమని చెబుతున్నారు. వారు రాకపోతే.. బీజేపీ బలం 106 దగ్గర ఉంటుంది. కాంగ్రెస్ – జేడీఎస్ కు 103 మంది సభ్యులు ఉంటారు. కనీసం.. ఐదారుగురు ఎమ్మెల్యేలను అయినా రెబెల్ క్యాంప్ నుంచి తీసుకొచ్చి ఓటింగ్ లో పాల్గొనేలా చేస్తే ప్రబుత్వం బయటపడే అవకాశం ఉంది. ఏం చేసినా.. రేపు బెంగళూరులో పొలిటికల్ డ్రామా ఖాయమనిచెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close