ఏపీలో “డిప్యూటేషన్‌ అర్హత” ఏమిటి..?

కర్ణాటక కేడర్‌కు చెందిన రోహిణి సింధూరి అనే అధికారిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆమె నెల్లూరులో పుట్టారు. హైదరాబాద్‌లో పెరిగారు. తెలంగాణకు చెందిన సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న సుధీర్ రెడ్డికి.. వైసీపీ నేతలతో పరిచయాలున్నాయని చెబుతున్నారు. కర్ణాటక కేడర్‌లో ఆమెకు రాజకీయ నాయకుల అండదండలతో.. మంచి పోస్టింగులే లభించాయి. అయితే.. పని చేసిన చోట్ల మాత్రం.. నేతలతో విబేధాలు తెచ్చుకోవడంతో.. వివాదాస్పదం అయ్యారు కూడా. ఈమెను డిప్యూటేషన్‌పై ఏపీకి తీసుకు రావడానికి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అటు కర్ణాటకకు.. ఇటు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఇద్దరూ అంగీకరిస్తే మాత్రం.. రోహిణీ సింధూరి ఏపీలో పని చేయడానికి వస్తారు.

స్టీఫెన్, శ్రీలక్ష్మిల సంగతేమయింది..?

జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి.. ఇతర రాష్ట్రాల్లోని అధికారులను డిప్యూటేషన్ పై తీసుకు రావడపైనే ఎక్కువగా దృష్టి సారించారు. తొలి సారి కేసీఆర్ తో సమావేశమైనప్పుడు.. తెలంగాణ క్యాడర్‌లో ఉన్న స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మిలను ఎపీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. దానికి కేసీఆర్ కూడా ఓకే అన్నారు. అయితే కేంద్రం మాత్రం అడ్డుపుల్ల వేసింది. ఫైళ్లను డీవోపీటీ పక్కన పెట్టేసింది. ఈ క్రమంలో వారిని ఏపీకి తీసుకొచ్చేందుకు… విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. వైసీపీ వర్గాలు చెబుతున్నారు. వీరి జాబితాలోకి తాజాగా రోహిణి సింధూరి చెబుతున్నారు.

డిప్యూటేషన్ల వెనుక ప్రాధాన్యాలేమిటి..?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులనే కాదు.. పలువురు ఇతర అధికారులను కూడా.. ఢిల్లీ నుంచి డిప్యూటేషన్ పై తీసుకొచ్చారు. టీటీడీ జేఈవోగా ధర్మారెడ్డి… కేంద్ర హోంశాఖలో ఉంటే తీసుకొచ్చారు. ఆయనకు పూర్తిగా కేంద్ర సర్వీసుల అధికారి. కానీ పట్టుబట్టి మరీ తీసుకొచ్చారు. అలాగే ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా నియమితులైన విజయకుమార్ రెడ్డిని కూడా డిప్యూటేషన్‌పై తీసుకొచ్చారు. ఇలా.. ఏ ప్రతిపాదికన.. అధికారులను తీసుకొస్తున్నారనేది చాలా మందికి పజిల్‌గా మారింది. అయితే.. ఎక్కువ మంది ఒకే సామాజికవర్గం కావడంతో… ఆ కోణంలోనే అధికారులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.. వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ.. “మన పాలన” పేరుతో తీసుకొస్తున్నారన్న ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

ఖాళీగా ఉంచిన ఐఎఎస్‌లకు పని చెప్పరా..?

ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం చెప్పినట్లు చేస్తారు. అంత మాత్రాన ప్రభుత్వం మారిన తర్వాత …ఆ ప్రభుత్వం చెప్పినట్లు చేసిన వారిని పక్కన పెట్టేయాలని కాదు. కానీ.. ఏపీ సర్కార్ గత .. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులందర్నీ పక్కన పెట్టేసింది. దాదాపుగా ఇరవై మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇప్పుడు పోస్టింగులు ఇవ్వలేదు. డిప్యూటేషన్ పై వచ్చిన వారిని వారి.. క్యాడర్ రాష్ట్రాలకూ పంపలేదు. అయినప్పటికీ.. ఇతర రాష్ట్రాల నుంచి అధికారులను మాత్రం వెల్లువగా తీసుకొస్తున్నారు. దీనిపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close