సుప్రీంకోర్టు తీర్పు ఫిరాయింపుదార్లకు అండగా నిలిచిందా..?

కర్ణాటక రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు దేశంలో ఓ కొత్త రాజకీయ వైపరీత్యాలకు దారి తీసే పరిస్థితి కనిపిస్తోందన్న అభిప్రాయం.. ఏర్పడుతోంది. పార్టీలు జారీ చేసే విప్‌లపైనే ఈ వైపరీత్యం ఏర్పడనుంది. సభకు హాజరు కావాలా వద్దా అన్నది రెబెల్ ఎమ్మెల్యేల ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉండాలని కోర్టు తీర్పు చెప్పడంతో మరి పార్టీలు జారీ చేసే విప్ మాటేమిటనేది రాజకీయ పార్టీల సందేహం. కోర్టు ఉత్తర్వుల తర్వాత విప్ ప్రస్తావనే ఉండదని బీజేపీ నేత యడ్యూరప్ప పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. ఫిరాయింపుల చట్టం ఎందుకు వర్తించదని.. కాంగ్రెస్ నేత శివకుమార్ అంటున్నారు.

ఎవరినీ నిర్బంధించలేమని సుప్రీం కోర్టు చెప్పిందని… ఆ మాట .. విప్‌ను ఉల్లంఘించమని కాదని.. కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు ఫిరాయింపుదారులను కాపాడేదిగా ఉందని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూ రావు ఆరోపించారు. దీని వల్ల పార్టీ మారేవారికి అనేక అవకాశాలిచ్చినట్లవుతుందన్నారు ప్రత్యర్థులతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అవకాశం ఇస్తుందంటున్నారు. రాజీనామాలు ఆమోదం పొందడమో… అనర్హతా వేటు వేయడమే జరగలేదు కనుక.. వారు ఇంకా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నట్లే లెక్క. అప్పుడు విప్ అంశం కూడా కచ్చితంగా ప్రస్తావనకు వస్తుందని కాంగ్రెస్ నేతలంతుటున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు… ఓ తీవ్రమైన రాజ్యాంగ సమస్యను ఆవిష్కరిస్తుదని.. కాంగ్రెస్ నేతలు గట్టిగానే వాదిస్తున్నారు.

మధ్యంతర తీర్పులో విప్ ప్రస్తావన లేకపోవడంతో భవిష్యత్తులో ఇతర అసెంబ్లీలోనూ ఇలాంటి ప్రశ్నలే తలెత్తితే ఏం చేయాలన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీ ఫిరాయించాలనుకున్న ఎమ్మెల్యేలు కర్ణాటక కేసు తీర్పును సాకుగా చూసి తప్పించుకునే వీలుందని కొందరి వాదన. పార్టీకి దూరమైన వారు ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాకుండా జాప్యం చేసేందుకు కూడా ఇది బాగానే ఉపయోగపడుతుంది. అందుకే.. రాజకీయవర్గాల్లో సుప్రీంకోర్టు తీర్పు కలకలం రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close