‘రాక్షసుడు’ కు కష్టకాలం

టాలీవుడ్ లో ఒక చిత్రమైన సెంటిమెంట్ వుంది. ఓ సినిమా పెద్ద హిట్ అయితే తరువాత వచ్చే సినిమాలు అన్నీ సలాం కొట్టి పక్కకు తప్పుకున్నట్లు వచ్చి వెళ్లిపోతాయి. ఇస్మార్ట్ శంకర్ డేట్ కు రావాల్సిన సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు. కానీ ఇస్మార్ట్ శంకర్ రావడంతో రెండు వారాలు వెనక్కు వెళ్లిపోయింది.

ఇస్మార్ట్ శంకర్ వచ్చిన వారానికే క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ వస్తోంది. టాలీవుడ్ సెంటిమెంట్, సినిమా ఎలా వుంటుందన్నది పక్కన పెడితే విజయ్ క్రేజ్ ఒక్కటి చాలు ఆ సినిమాను గట్టెక్కించేయడానికి. ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వుంటాయి. ఆపైన సినిమా ఏమాత్రం బాగున్నా, ముందుకు వెళ్లిపోతుంది.

కానీ బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ పరిస్థితి అలాంటిది కాదు. ఎందుకంటే హీరో ఫుల్ గా డౌన్ లో వున్నారు. ఆ టైటిల్, కాంబినేషన్, జోనర్ ను బట్టి చూస్తే ఓపెనింగ్స్ తెచ్చుకోవడం కూడా కాస్త కష్టమే. సినిమా ఎంతో బాగుంది అంటే తప్ప, నిల్చోవడం కష్టం. పైగా దానికి గుణ 369 సినిమా పోటీ వుంది.

ఇస్మార్ట్, డియర్ కామ్రేడ్ ల మాదిరిగా సోలో విడుదల కాదు. పైగా రాక్షసుడు వచ్చిన వారానికి నాగార్జున మన్మధుడు 2 సినిమా వచ్చేస్తోంది. అంటే ముందు వారాలు, వెనుక వారాలు కూడా ఫుల్ కాంపిటీషన్ నే. ఆగస్టు 15న శర్వానంద్ రణరంగం, అడవి శేష్ ఎవరు సినిమాలు వున్నాయి.

పోనీ బెల్లంకొండ రాక్షసుడు సినిమానే వాటి అన్నింటికి కాంపిటీషన్ అని అనుకోవచ్చు కదా? అనడానికి లేదు. ఎందుకుంటే విజయ్ దేవరకొండ, నాగార్జున, శర్వానంద్ లకు వున్న క్రేజ్ బెల్లంకొండకు ఇంకా రాలేదు. వరుస ఫ్లాపులు అతన్ని బాదపెడుతున్నాయి. పైగా రాక్షసుడు జోనర్ కూడా బాగా లిమిటెడ్. ఎంతో బాగుంది అంటే వీటిని తట్టుకుని నిల్చోడం చాలా కష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుడివాడ వైసీపీలో డబ్బు పంపిణీ రచ్చ

కొడాలి నాని గుడివాడను స్థావరంగా మార్చుకున్నారు. పార్టీ ఏదైనా నాలుగు సార్లు గెలిచారు. ఐదో సారి గెలవడానికి ఆయన డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. గుడివాడ పట్టణంలో ఒక్కో వార్డుకు...

ఇంత మోసమా కొమ్మినేని ? వైసీపీ క్యాడర్‌ని బలి చేస్తారా ?

వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్...

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close