ప్రపంచబ్యాంక్‌కు చాన్సివ్వకూడదనే రుణం వద్దన్న కేంద్రం..!

అమరావతికి ఇక రుణం మంజూరేనని.. అనుకుంటున్న సమయంలో.. ప్రపంచబ్యాంక్ షాకిచ్చింది. రుణ ప్రతిపాదనల నుంచి ఒక్క సారిగా డ్రాప్ అయిపోయింది. అసలు దీని వెనుక ఏం జరిగిందన్నదానిపై.. మాత్రం.. రకరకాల చర్చలు జరుగాయి. జగన్ పై నమ్మకం లేకనే.. ప్రపంచబ్యాంక్ రుణం ఇవ్వలేదంటూ.. టీడీపీ నతేలు ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఉద్ధృతంగా సాగడంతో.. వరల్డ్ బ్యాంకే వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రుణప్రతిపాదన విరమించుకోవడం వల్లే.. తాము వెనక్కి తగ్గామని ప్రకటించింది.

కేంద్రం అమరావతికి రుణం వద్దని చెప్పిన మాట నిజమే..!

ఏపీలో చంద్రబాబు సర్కార్ ఓడిపోగానే… ప్రపంచబ్యాంక్ నుంచి ఓ లేఖ వచ్చింది. అమరావతి రుణ ప్రతిపాదన చివరి పరిశీలనలో ఉందని..అయితే.. గతంలో వచ్చిన అభ్యంతరాల మేరకు.. ఓ సారి పూర్తి స్థాయి పరిశీలన జరుపుతామని ఆ లేఖ సారాంశం. అయితే ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించలేదు. ప్రాజెక్టును మరో సారి ఇన్స్‌స్పెక్షన్ చేస్తామన్న ప్రపంచబ్యాంక్ బృందానికి అనుమతి ఇవ్వవొద్దని.. ప్రభుత్వం మారిన తర్వాత ఏపీ సర్కార్ ను కేంద్రం ఆదేశించింది. ఇది చెడు సంప్రదాయమని.. ఒక సారి చాన్సిస్తే.. ప్రపంచబ్యాంక్ తాము రుణం ఇచ్చే.. అన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తామని చెబుతుందని.. కేంద్రం భావించింది. అమరావతికి ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకోవాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని… సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా.. ప్రపంచబ్యాంక్ రుణంపై ఆసక్తి చూపించలేదు.

ప్రపంచబ్యాంక్ బోర్డు భేటీ కంటే ముందే నిర్ణయం ఎందుకో..?

నిజానికి మంగళవారం ప్రపంచబ్యాంకు బోర్డు సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే ప్రపంచవ్యాప్తంగా తమకు వచ్చిన రుణ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రపంచబ్యాంక్ బోర్డు సమావేశంతో సంబంధం లేకుండా.. అమరావతి రుణ ప్రతిపాదనల నుంచి ప్రపంచబ్యాంక్ డ్రాప్ అయిపోయింది. సమావేశం వరకూ ఎందుకు ఆగలేకపోయారన్నది మరో కీలకమైన అంశం. అసలు కేంద్ర ప్రభుత్వమే డ్రాప్ అయిపోయిన తర్వాత.. మళ్లీ కొత్తగా బోర్డులో చర్చించేదేముందని.. ప్రపంచబ్యాంక్ భావించినట్లు తెలుస్తోంది.

మరి అమరావతికి కేంద్రం నిధులు సమకూరుస్తుందా..?

ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయంతో.. జరిగే ఇతర పనులకు ఆటంకం రాకుండా.. ఇబ్బంది కలగకుండా.. అమరావతికి రావాల్సిన రుణాన్ని కేంద్రం నిలిపి వేసింది. మరి ప్రత్యామ్నాయ వనరుల సమీకరణకు ప్రయత్నిస్తుందా.. అనేది ఆసక్తికరం. అవసరమైతే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాల్ని చూద్దామని సలహా ఇచ్చిందని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ విషయంలో కేంద్రం ఎంత మేర సహకరిస్తుందో.. ముందు ముందు తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close