“బైసన్ పోలో” ఇవ్వనందుకు కేంద్రంపై కేసీఆర్ రివెంజ్..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు.. మోడీ నేతృత్వంలోని రెండో సర్కార్‌తో ఏ మాత్రం సన్నిహిత సంబంధాలు లేవన్న ప్రచారం కొద్ది రోజలుగా సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సందర్భం వచ్చినప్పటికీ.. మోడీని కలిసేందుకు కేసీఆర్ సిద్ధపడలేదు. పలు కార్యక్రమాలకు డుమ్మాకొట్టారు. అదే సమయంలో.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కు పిలువలేదంటూ.. బీజేపీ నేతలు చేసిన విమర్శలపై ఘాటగా స్పందించారు. ఒక్క రూపాయి కూడా.. ఇవ్వకుండా.. క్రెడిట్ కోసం పాకులాడుతున్నారన్నట్లుగా మాట్లాడారు. ఇది మాత్రమే కాదు.. కొత్త సచివాలయ నిర్మాణానికి బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వమి కేసీఆర్ చాలా కాలంగా కేంద్రాన్ని అడుగుతున్నారు. ఇదిగో.. అదిగో.. అంటూ తిప్పించుకున్న కేంద్రం.. చివరికి.. పక్కన పెట్టేసింది. ఈ పరిణామాలన్నింటితో… రగిలిపోయిన కేసీఆర్.. కేంద్రానికి కూడా అలాంటి షాక్ ట్రీట్‌మెంటే ఇవ్వాలనుకుంటున్నట్లుగా తాజా పరిణామాలు ఉన్నాయి.

తెలంగాణలో రక్షణశాఖకు గతంలో భూములు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ ప్రస్తుతానికి పక్కన పెట్టింది. వికారాబాద్ వద్ద 2934 ఎకరాల భూమిని నేవీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని నిబంధనలు కూడా పెట్టారు. అయితే.. ఇప్పుడు .. నేవీ అధికారులు.. ఆ నిర్ణయాలను అమలు చేయాలని.. భూమిని స్వాధీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం.. కేంద్రం.. బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వడానికి ఎంత సతాయించిందో.. అదంతా గుర్తు చేసుకుందేమో కానీ.. భూములను ఇవ్వడాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టేసింది. అంతే.. ప్రభుత్వ వర్గాలతో చర్చలకు వచ్చిన నేవీ అధికారులకు.. విషయం నేరుగానే చెప్పేశారు. బైసన్ పోలో సహా.. అభివృద్ధి పనులకు అవసరమైన రక్షణ శాఖ భూమిని.. అప్పగిస్తేనే… వికారాబాద్ భూములు ఇస్తామని… చెప్పేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇది ఒక్కటే కాదు.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలు.. మొత్తంగా ఎనిమిది భూసేకరణ ప్రాజెక్టులు చేపట్టాయి. వీటిలో రకరకాల పనులను ఆయా విభాగాలు ప్రతిపాదించాయి. వీటన్నింటినీ తెలంగాణ సర్కార్ పెండింగ్ లో పెట్టేసింది. తెలంగాణ సర్కార్ వైఖరి ఇప్పుడు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు. సాధారణంగా.. రక్షణ శాఖ అడిగితే.. ఏ రాష్ట్రం అయినా భూముల కేటాయింపులో.. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోదు. కానీ కేసీఆర్ మాత్రం… తెలంగాణ పట్ల.. బీజేపీ సర్కార్ ఎలాంటి… ఆదరణ చూపుతుందో.. తాను కూడా.. అలానే ఊండాలని కోరుకుంటున్నారు. అంతే చేస్తున్నారు కూడా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com