బిగ్‌బాస్ సీజన్ – 3 కంటెస్టెంట్స్‌ ఎంట్రీ అదిరింది, తొలిరోజే ట్విస్ట్

బిగ్‌బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్నరియాలిటీ షో ఇది. ఇక తెలుగులో ‘స్టార్ మా’లో గత రెండు సీజన్లలో సూపర్ హిట్‌గా నిలిచింది ఈ షో. మొత్తానికి తాజాగా బిగ్‌బాస్ సీజన్ 3 స్టార్ట్ అయ్యింది. మొదటి సీజన్‌కు జానియర్ ఎన్టీఆర్‌, రెండోదానికి నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే ఈసారి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. 100 రోజుల పాటు సాగే ఈ షోలో 15 మంది కంటెస్టెంట్స్‌ పాల్గొంటారు.

బిగ్‌బాస్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభమైన తీరు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ‘‘సర్ షాట్ ఒకే’ అనే హీరో రాహుల్ డైలాగ్‌‌తో షో స్టార్ట్ అవుతుంది. ఇక షూటింగ్‌లో షాట్ అయిపోగానే అక్కినేని నాగార్జున కారులో నుంచి దిగి వస్తూ ‘థ్యాంక్యూ రాహుల్’ అంటూ ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తారు. ‘‘చల్లటిగాలి.. నీలాకాశం.. చుట్టూ మంచు కొండలు..ఇలా నేచర్ మధ్య బతకడం నాకు చాలా ఇష్టం. అసలు ఆ బిగ్‌బాస్ హౌస్‌లో వాళ్లు అన్ని రోజులు, అన్ని కెమెరాల మధ్య ఎలా బతుకుతున్నారు. నన్ను బతకమంటే నా వల్ల మాత్రం కాదు. అందుకే నాకు ఆ షో అంటే ఇష్టం లేదు. కానీ మనసు కోతి లాంటిది. ఆ షో మీ అందరికీ ఎందుకిష్టమో నాకూ తెలుసుకోవాలని ఉంది. అందుకే ఈసారి రంగంలోని నేను దిగుతున్నాను’’ అని నాగార్జున బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

తర్వాత కింగ్ మూవీలోని నడిచే స్టైల్ ఏమో రాకీ సాంగ్‌తో కింగ్ నాగార్జున ఎంట్రీ ఉంటుంది. గత సీజన్‌లలో షోను చాలా సక్సెస్‌ఫుల్‌గా నడిపిన జూ. ఎన్టీఆర్, నానిలకు అభినందలు తెలిపారు కింగ్. బిగ్‌బాస్ చాలా సంస్కార‌వంతమైన షో, కుటుంబంలో ప్రతి ఒక్కరినీ ఒకే ఇంటిలో ఒకే దగ్గర బంధాలతో అను బంధాలతో నడిపే షో అంటూ బిగ్‌బాస్ ప్రత్యేకతలను వివరిస్తూ షో ప్రారంభించారు నాగ్.

బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చే 15 మంది కంటెస్టెంట్స్‌ని సెలెక్ట్ చేయాలంటూ హోస్ట్‌ నాగార్జునను బిగ్‌బాస్ ఆదేశించారు. ఇక సెలెక్ట్ చేసిన చీటీల్లో నుంచి మొదటగా మూడు చీటీలను తీసి వారిని హౌస్‌లోకి ఆహ్వానించారు నాగ్. మొదటి కంటెస్టెంట్‌గా తీన్మార్ సావిత్రి (శివజ్యోతి)ని మొదటి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టారు. ట్రంకు పెట్టెతో ఆమె ఎంట్రీ అదిరిపోయింది. తర్వాత టీవీ యాక్టర్ రవిక్రిష్ణ ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రవికి సావిత్రి వెల్‌కమ్ చెప్పింది. ఇక మూడో కంటెస్టెంట్‌గా డబ్‌స్మాష్ స్టార్, సోషల్ మీడియా సెలబ్రిటీ అషురెడ్డి ఎంట్రీ ఇచ్చారు. అయితే నాగ్ ఆమెను అడిగీ మరీ హగ్ ఇప్పించుకుంటాడు.

నాలుగో కంటెస్టెంట్‌గా జాఫర్ ఎంట్రీ ఇచ్చారు. ‘‘ఎప్పుడైనా తప్పుడు ఇంటర్వ్యూలు చేశారా’’ అని నాగ్ ప్రశ్నించగా అమ్మో చాలాసార్లు చేశానంటూ జాఫర్ సమాధానం ఇచ్చారు. ఐదో సెలబ్రిటీగా హిమజ ఎంట్రీ అయ్యారు. బుల్లెట్ మీద వచ్చె బుల్ రెడ్డి అనే మాస్ సాంగ్‌తో ఆమె ఎంట్రీ అదిరింది. నాగ్‌ని అడిగి మరీ ఓ సారి తనను టచ్ చేయించుకుంది హిమజ.

ఆరో సెలబ్రిటీగా రాహుల్ సిప్లిగంజ్‌ ఎంట్రీ అయ్యారు. నాగ్ ఎదుట, హౌస్‌లో పాటలు పాడి అదరొట్టారు రాహుల్. ఏడో కంటెస్టెంట్‌గా రోహిణి ఎంట్రీ ఇచ్చారు. నాగార్జున తరహాలో మిమిక్రీ చేసి అలరించింది రోహిణి. ఎనిమిదో కంటెస్టెంట్‌గా బాబా భాస్కర్ ఎంట్రీ అయ్యారు. తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాలం ఎంట్రీ ఇచ్చారు.

పదో కంటెస్టెంట్‌గా నటి హేమ ఎంట్రీ ఇచ్చారు. పదకొండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అలీరెజా తన సిక్స్ ప్యాక్ బాడీ ప్రదర్శించాడు. పన్నెండో కంటెస్టెంట్‌గా కమెడియన్ మహేష్ విట్టా ఎంటరయ్యారు. పదమూడో కంటెస్టెంట్‌గా యాంకర్ శ్రీముఖి అదిరిపోయే డ్యాన్స్‌తో ఎంట్రీ ఇచ్చారు శ్రీముఖి.

ఇక చివరగా జంటగా వరుణ్ సందేశ్ ఆయన భార్య వితికా షెరు ఎంట్రీ ఇచ్చారు. మీరిద్దరూ ఫైనల్‌కు వస్తే ఏం చేస్తారని వితికాను నాగార్జునని అడగగా తానే గెలవాలనుకుంటాను అని వితికా సమాధానం ఇచ్చింది. ఇక వరుణ్‌ మాత్రం వితికా గెలిచినా తాను గెలిచినట్టేనన్నారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా పర్వాలేదన్నారు. తర్వాత నాగార్జున చెప్పడంతో బిగ్‌బాస్ స్టేజ్ నుంచి వితికాను ఎత్తుకుని బిగ్‌బాస్ హౌస్‌‌లోకి వెళ్లాడు వరుణ్.

అయితే మొదటి రోజే హౌస్‌లో ట్విస్ట్ ఇచ్చారు బిగ్‌బాస్. శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితికా షెరు, బాబా భాస్కర్, జఫ్ఫార్ లను నామినేట్ అయ్యారని చెబుతారు బిగ్‌బాస్. ఆ ఐదుగురు షాక్‌‌లో ఉండగా మొదటి ఎపిసోడ్ ముగుస్తుంది. చూద్దాం.. ఈ సారి బిగ్‌బాస్ సీజన్3 ఎన్ని ట్విస్ట్‌లతో దూసుకెళ్తుందో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close