పఠాన్ కోట్ వంటి దాడులు ఇంకా చాలా చేస్తాము: హఫీజ్ సయీద్

పఠాన్ కోట్ పై దాడికి కుట్ర పన్నినవారెవరో కనిపెట్టేందుకు భారత్ మరిన్ని ఆధారాలు ఇవ్వాలని పాక్ కోరుతోంది. పఠాన్ కోట్ పై దాడికి కుట్ర పన్నినవారిని ఉపేక్షిస్తూ తన ద్వంద వైఖరిని మారో మారుచాటుకొంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ కేంద్రంగా మారిందని భారత్ వాదనలు అది ఖండిస్తుంటుంది. కానీ ఉగ్రవాదులను స్వేచ్చగా దేశంలో తిరగనిస్తుంది. ఆ విషయం పాక్ అంగీకరించకపోయినా కరడు గట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్, పఠాన్ కోట్ పై దాడికి పాల్పడ్డామని చెప్పుకొంటున్న యునైటెడ్ జిహాదీ కౌన్సిల్ నాయకుడు సయీద్ సల్లాఉద్దీన్ తో కలిసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో బుదవారం ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, మున్ముందు పఠాన్ కోట్ వంటి దాడులు ఇంకా చాలా చేయబోతున్నామని ప్రకటించాడు.
దానిపై భారత్ చాలా తీవ్రంగా స్పందించింది. “హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ లో చాలా స్వేచ్చగా తిరుగ గలుగుతున్నారు. అతను భారత్ పై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నాడు. తనకి సహాయ సహకారాలు అందజేసేవారున్నారని బహిరంగానే ప్రకటిస్తున్నాడు. అతని ప్రసంగాలను మీడియాలో ప్రదర్శించకూడదని పాక్ ప్రభుత్వం గత అక్టోబరులో ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలను ఎవరూ పట్టించుకొంటున్నట్లు లేదు. యావత్ ప్రపంచ దేశాలు అతనిని ఉగ్రవాదిగా పేర్కొంటున్నాయి. దానిని అతను కూడా స్వయంగా దృవీకరిస్తున్నాడు. అయినా కూడా అతనిని అరెస్ట్ చేయడానికి పాక్ ప్రభుత్వం వెనుకాడుతోంది. అతనిని తక్షణమే అరెస్ట్ చేసి చర్యలు చేపట్టాలని భారత్ కోరుటోంది,” అని అన్నారు.
కానీ భారత్ చేసే ఇటువంటి విజ్ఞప్తులకు పాకిస్తాన్ స్పందించే మాటయితే ఎప్పుడో ఉగ్రవాదులు అందరినీ అరెస్ట్ చేసేది. ఉగ్రవాదులలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వేరేగా ఉండరని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెపుతుంటారు. కానీ ఉగ్రావాదులలో పాక్ పై దాడులకు పాల్పడేవారు, భారత్ పై దాడులకు పాల్పడేవారు వేరేగా ఉంటారని ఆయన భావిస్తున్నారేమో. అందుకే భారత్ పై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్న హఫీజ్ సయీద్ వంటి వారిని ఉపేక్షిస్తూ పాక్ లో దాడులకు పాల్పడిన వారిపై మాత్రమే అపుడప్పుడు చర్యలు తీసుకొంటూ ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

‘లాపతా లేడీస్’ రివ్యూ: దారితప్పి మార్గం చూపిన పెళ్లి కూతుళ్ళు

'ధోబీ ఘాట్' లాంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావు, దాదాపు దశాబ్ద విరామం తర్వాత 'లాపతా లేడీస్' కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ...

టాలీవుడ్‌ ‘మే’ల్కొంటుందా?

2024 క్యాలెండ‌ర్‌లో నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. ఈ వ్య‌వ‌ధిలో తెలుగు చిత్ర‌సీమ చూసింది అరకొర విజ‌యాలే. ఏప్రిల్ అయితే... డిజాస్ట‌ర్ల‌కు నెల‌వుగా మారింది. మే 13తో ఏపీలో ఎన్నిక‌ల హంగామా ముగుస్తుంది. ఆ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close