చంద్రబాబు ఖాతాలోకి ఆర్‌.కృష్ణయ్య అడ్డుపుల్లలు!

సేన చెడుగైన దండనాధుని తప్పు’ అంటూ నరసింహ శతక కారుడు జీవిత సత్యాలను చాలా సింపుల్‌ పదాల్లో తేల్చిచెప్పాడు. సైన్యం సరిగ్గా పోరాడాక పోతే.. ఆ తప్పు ఆ సేనాధిపతి ఖాతాలోకే వెళుతుంది. ఇప్పుడు చంద్రబాబుకు ఎదురవుతున్న ఇబ్బందికరమైన పరిస్థితి కూడా అదే! తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, రాత బాగుండి ఉంటే అటు చంద్రబాబు మాదిరిగానే ఇటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగి ఉండవలసిన వాడు అయిన బీసీ సంఘాల నాయకుడు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతున్న దుడుకు మాటలు అన్నీ ఇప్పుడు చంద్రబాబు ఖాతాలోనే పడుతున్నాయి.

కాపులను బీసీల్లో చేర్చే వ్యవహారం అసలే రాష్ట్రంలో అతిపెద్ద వివాదాస్పద అంశంగా మారుతూ ఉండగా.. ఆ మంటలను మరికాస్త ఎగదోస్తున్నట్లుగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతున్నారు. కాపులను బీసీల్లో చేరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోయేది లేదంటూ అడ్డుపుల్లలు వేస్తున్నారు. కొన్నిరోజుల వ్యవధిలోనే ఆయన వాయిస్‌లో బాగా తేడా వచ్చింది కూడా! కాపుల రిజర్వేషన్‌ పేరిట బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని మొన్నటిదాకా గర్జించారు. అయితే ఇప్పుడు అసలు వారిని బీసీలు చేస్తే ఊరుకోం అని ప్లేటు మార్చారు. కనీసం ఆయన తన తొలివాదనకు కట్టుబడితే అది కొంత మేలు. కానీ ఇలా అనడం వల్ల.. కులాల మద్య చిచ్చు రగిలే ప్రమాదం ఉంది.

అయితే విపక్షాల వారంతా ఇప్పుడు ఆర్‌.కృష్ణయ్య మాటలన్నిటినీ చంద్రబాబు ఖాతాలోనే వేస్తూ ఆయనకే ఆపాదిస్తున్నారు. నిజానికి ఆర్‌.కృష్ణయ్య, పార్టీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో మెలిగే దశలో ఏమాత్రమూ లేడని, చాలా విషయాల్లో చంద్రబాబును చికాకు పెట్టేలాగానే వ్యవహరిస్తున్నాడని క్లోజ్‌గా పరిణామాలు గమనిస్తున్న ఎవరికైనా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఆర్‌.కృష్ణయ్యకు కీ ఇచ్చి చంద్రబాబు వెనుకనుంచి మాట్లాడిస్తున్నాడంటూ.. విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
ఒకవైపు తన సొంత పార్టీ ఎమ్మెల్యే, తానై స్థాయి పెంచిన నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలతో చికాకు పెడుతుండడం ఒక ఎత్తు, మరోవైపు దానికి బాధ్యుడు తనే అంటూ విమర్శలు మరో ఎత్తు. చంద్రబాబు పరిస్థితి పాపం.. అటు చెంపదెబ్బ.. ఇటు గోడదెబ్బ అన్నట్లుగా తయారైపోతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close