ఆలయాల వైపు అడుగు..! ట్రస్ట్ బోర్డుల్లోనూ రిజర్వేషన్లు..!

వైఎస్ జగనమోహన్ రెడ్డి అందరికి సమాన న్యాయం అందాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా… నామినేటెడ్ పోస్టుల్లో మాత్రమే కాదు.. నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ యాభై శాతం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యాభై శాతం అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. దీని కోసం అసెంబ్లీలో చట్టం చేశారు. కానీ దేవాదాయ శాఖను మాత్రం మినహాయించారు. ఇప్పుడు దేవాదాయ శాఖలో… మైనార్టీలను మినహాయించి.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యాభై శాతం అవకాశం నామినేటెడ్ పోస్టులు కల్పించేందుకు ప్రత్యేకంగా సవరణ చట్టాన్ని ఏపీ సర్కార్ బుధవారం అసెంబ్లీలో ప్రతిపాదించింది. 1987 లో రూపొందిన చట్టానికి.., సవరణలు చేస్తూ.. దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చట్టాన్ని ప్రతిపాదించారు. ఇది ఆమోదం పొందడం లాంఛనమే.

చట్టం ప్రకారం… ప్రతి ఆలయ బోర్డులో… యాభై శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలను నియమిస్తారు. గతంలోనూ ప్రభుత్వాలు.. ఈ వర్గాలకు అవకాశాలు ఇచ్చేవి. అయితే.. అది స్వచ్చందంగా మాత్రమే ఉండేది కాదు. రాజకీయ ప్రాబల్యాన్ని బట్టి.. పదవులు ఇవ్వాలనుకుంటే ఇచ్చేవి. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న చట్టం కారణంగా.. ఇక కచ్చితంగా ప్రతి ఆలయ బోర్డులోనూ.. యాభై శాతం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలని రూపొందించారు. అంటే.. ఉదాహరణకు.. ఓ ఆలయబోర్డులో…చైర్మన్ తో కలిపి.. ఇరవై మంది సభ్యులు ఉంటే.. అందులో కచ్చితంగా… పది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారు ఉండాలనేది… కొత్త చట్టం చెబుతోంది. అయితే.. ఈ మూడు వర్గాలకు చెందిన వారికి.. ఏయే దామాషాలో… పదవులు ఇవ్వాలో మాత్రం చెప్పలేదు. మొత్తం బీసీలకు అయినా.. మొత్తం ఎస్సీలకు అయినా.. లేదా మొత్తం ఎస్టీలకు అయినా… ఇచ్చే ఫ్లెక్సిబులిటీని చట్టంలో పెట్టుకున్నారు. అయితే.. ఓ మహిళా సభ్యురాలు మాత్రం ఉండాల్సిందేనన్నారు.

నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు 50 శాతం రిజర్వేషన్లు అంటూ.. రెండు రోజుల కిందట… ప్రభుత్వం ఓ ప్రత్యేకమైన బిల్లును ప్రవేశపెట్టింది. అందులో దేవాదాయశాఖను మినహాయించారు. అప్పుడే చాలా మందిలో ఆశ్చర్యం వ్యక్తమయింది. అయితే.. అందులో.. మైనార్టీలకూ అవకాశం ఉండటం…అదే చట్టాన్ని దేవాదాయశాఖకు అన్వయిస్తే.. ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో.. మైనార్టీలను తొలగించి.. దేవాదాయశాఖ చట్టానికి సవరణ చేశారు. ఇక నుంచి.. ఆలయాల బొర్డుల్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కచ్చితంగా సగానికి సగం ప్రాతినిధ్యం దక్కనుంది. అయితే పదవుల పరంగా.. ఇది.. ఆయా పార్టీల్లో ఉండే నేతలకు.. లాభమే కానీ.. ఆలయాల అభివృద్ధికి ఎంత వరకూ ఉపయోగం అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. కానీ నియామకాల విషయంలో… ఎంతో జాగ్రత్తగా ఉండకపోతే.. వివాదాలు మాత్రం చుట్టుముట్టడం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close