బుమ్రా గురించి న‌న్ను అడ‌గొద్దు: అనుపమతో ఇంటర్వ్యూ

‘ప్రేమమ్ ‘ తో వెండితెరపైకి వచ్చి.. ‘అ ఆ’ తో తెలుగు ప్రేక్షకులని అలరించింది అనుపమ. తక్కువ కాలంలోనే ప్రేక్షకులుకు గుర్తుండిపోయే సినిమాలు చేసింది. ‘హలో గురు ప్రేమ కోసమే’ తర్వాత ఆమె నుండి వస్తున్న సినిమా ‘రాక్షసుడు’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో. రమేష్ వర్మ దర్శకుడు. ఇప్పటివరకూ ప్రేమ కధలు, ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్స్ లో కనిపించిన అనుపమ.. ఈ సినిమతో థ్రిల్లర్ జోనర్ ని టచ్ చేసింది. ఈ సినిమా విడుదలకు సిద్దమౌతున్న సందర్భంగా.. ఆమె చెప్పిన సంగతులివి.

* త‌మిళ మూవీ ‘రాక్షసన్’ చూశారా ?
-రమేష్ గారు వచ్చి సినిమా గురించి చెప్పినప్పుడు జస్ట్ కథ మాత్రమే విన్నా. కానీ తమిళ్ వెర్షన్ మా నాన్నగారు ముందు చూశారు. ఆయనకి చాలా నచ్చింది. నన్ను చూడమన్నారు. చూశా. చాలా బావుంది. కంటెంట్ వున్న సినిమా ఇది.

* రీమేకులపై మీ అభిప్రాయం ?
-ఇది నా సెకండ్ రీమేక్. ముందు ప్రేమమ్ చేశాను. అది అంత కష్టం కాదు. ఎందుకంటె ఒరిజినల్ పాత్రే చేశాను. ఎలాంటి పోలికలు రావు. కానీ రాక్షసుడు సినిమా వచ్చేసరికి అమలాపాల్ రోల్ చేశాను. ఖచ్చితంగా పోలికలు పెడతారు. ఐతే నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు నేను చేశాను. నా పెర్పార్మెన్స్ పై దర్శక, నిర్మాతలు హ్యాపీ. ప్రేక్షకులు రియాక్షన్ చూడాలి.

*అమలా పాల్ ని అనుకరించారా?
-అమలాపాల్ అంటే నాకు చాలా ఇష్టం. ఒరిజనల్ వెర్షన్ లో ఆమె నటన అద్భుతం. స్క్రీన్ టైం తక్కువ వున్నా.. ఆమె పాత్ర కథలో కీలకం. ఆ పాత్రతో చాలా మలుపులు ఉంటాయి. నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదే. నేను నా స్టయిల్ లో చేశాను. అది ఎలా వచ్చిందో మీరు చూసి చెప్పాలి.

*మార్పులు ఏమైనా చేశారా ?
-పెద్ద మార్పులు ఏమీ వుండవు. నేటివిటీ మార్పులు కొన్ని వున్నాయి. కంటెంట్ ని డిస్టర్బ్ చేయకుండా చిన్నచిన్న మార్పులు జరిగాయి. మాతృక ఆత్మని పట్టుకునే ప్రయత్నం చేశాం.

*చీరలో కనిపించారు ? కొత్తగా వుందా ?
అవునండీ.. చాలా కొత్తగా వుంది. ఇందులో చాలా మెచ్యూర్ పాత్ర చేశాను. ఇప్పటివరకూ ఇలాంటి పాత్రని చేసింది లేదు. స్కూల్ టీచర్ ని. నా పాత్రలో ఆ మెచ్యూరిటీ తెరపై కనిపిస్తుంది. చాలా ఎక్సయింటింగా వుంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కాక‌పోతే చీర నాకు కొత్త కాదు. ఐదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడే చీర క‌ట్టా.

* హీరో సాయి శ్రీనివాస్ గురించి ?
– సాయి చాలా స్వీట్ పర్శన్. చాలా హార్ట్ వర్కింగ్. సీన్ బాగా రావడం కోసం ఎన్ని టేకులు చేయడానికైన రెడీగా ఉంటాడు. ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం కాబట్టి త్వరగానే ఫ్రెండ్స్ అయిపోయాం.

* దర్శకుడు రమేష్ వర్మ గురించి ?
– ఈ సినిమా కోసం మొదట నన్ను సంప్రదించిన వ్యక్తి ఆయన. ఆయన చాలా పర్టికులర్ . నా కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. నా కాస్ట్యూమ్ కుడా ఆయనే డిజైన్ చేశారు. చిన్న ఎక్స్ ప్రెషన్ కూడా ఆయన కౌంట్ చేస్తారు. ఆయనతో పని చేయడం మంచి అనుభవం.

* డబ్బింగ్ వద్దు అనుకున్నారట ?
– అవునండీ. నా వాయిస్ పాడైయింది. ఒక మలయాళం సినిమాకి సహాయ దర్శకురాలిగా చేశా. వాయిస్ పై పెద్ద శ్రద్ధ తీసుకోలేదు. అవుట్ డోర్ లో తిరగడంతో గొంతుపోయింది. ఇప్పటికీ ఇంకా సెట్ కాలేదు. అందుకే డబ్బింగ్ వద్దు అనుకున్నా. కానీ పట్టుబట్టి నాతోనే చెప్పించారు. ( నవ్వుతూ)

* సడన్ గా సహాయ దర్శకురాలిగా ఎందుకు మారారు ?
-నా మొదటి సినిమా జరుగుతున్నప్పుడే ఆ దర్శకుడి దగ్గర మాట తీసుకున్నా. మీ రెండో సినిమాకి సహాయ దర్శకురాలిగా చేస్తానని. నేను సినిమాని ప్రేమిస్తున్నా. అందుకే ఇక్కడ అన్నీ నాకు తెలియాలి. అన్ని విభాగాలమీద పట్టు సాధించాలి. అప్పుడే నా పనిపై నాకు శ్రద్ధ పెరుగుతుంది. దీనికి సహాయ దర్శకురాలిగా పని చేయడమే ఉత్తమ మార్గం. ఆ సినిమా నిర్మాత దుల్కర్ సల్మాన్ నాకు మంచి ఫ్రెండ్. నేను కూడా ఓ రోల్ చేశా. పనిలో పనిగా సహాయదర్శకురాలి చేరిపోయా.

* సహాయ దర్శకురాలిగా ఎలాంటి అనుభవం సాధించారు ?
నిజంగా అలా పని చేసిన తర్వాత .. సినిమా ఇంకా బెటర్ గా అర్ధమైయింది. నటిగా ఉంటే కార్వాన్ దాటి బయటప్రపంచం తెలీదు. కానీ ఇప్పుడు నాకు నా వృత్తిపై ఇంకా గౌరవం పెరిగింది. ఒక సినిమా వెనుక వున్న కష్టం ఇంకా బాగా అర్ధమైయింది

*మెగా ఫోన్ ఎప్పుడు పట్టుకుంటారు ?
-అప్పుడే కాదు. చాలా మంది దగ్గర సహాయదర్శకురాలిగా పని చేయాలి. ఇంకా పట్టు సాధించాలి. తర్వాతే దర్శకత్వం.

*నిన్ను కోరి రీమేక్ చేస్తున్నారని విన్నాం ?
-అవునండీ. ఇక్కడ నివేదితా రాకింగ్. ఒక విధంగా ఈ పాత్ర నాకో ఛాలెంజ్. చాలా ఇష్టపడి చేస్తున్నా.

*క్రికెటర్ బుమ్రా తో డేటింగ్ అనే వార్తలు వచ్చాయి?
– నో కామెంట్స్ అండి. దాని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. బుమ్రా గురించి న‌న్ను అడ‌గొద్దు. నేనేం చెప్ప‌లేను.

*తెలుగులో బెస్ట్ ఫ్రెండ్స్ ?
– బెస్ట్ అనీ పర్టికులర్ గా ఏమీ లేదు. కలసి పని చేసిన వాళ్ళం ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడుకుంటాం. స‌మంత నేనూ ఓ సినిమా చేశాం క‌దా..? మా మ‌ధ్య ఫ్రెండ్ షిప్ ఉంది.

* ఆల్ ది బెస్ట్
– థ్యాంక్యూ..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close