సీఎం టు మినిస్టర్స్..! ఏపీ అసెంబ్లీలో తెలంగాణకు ప్రచారం..!

“నాకు సురేష్‌లాగా కారు లేదు… నాకు సురేష్‌ లాగా బంగ్లా లేదు.. నాకు సురేష్ లాగా ఆస్తుల్లేవు..” కానీ నువ్వంటే నాకిష్టం అంటో వ్యక్తి .. తను వన్ సైడ్‌గా ప్రేమిస్తున్న అమ్మాయితో. ఇవన్నీ సరే కానీ… ఆ సురేష్ ఎవరు..? ఎక్కడుంటాడో చెప్పమంటుంది.. ఆ అమ్మాయి…!…. ఆ అమాయక అబ్బాయి.. అడ్రస్ కూడా చెప్పే సీన్ తర్వాత ఉండొచ్చు… ఇప్పుడు.. అచ్చంగా… ఆ అమాయక అబ్బాయిలానే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో.. తెలంగాణ విధానాలపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. సొంత రాష్ట్ర విధానాలపై విమర్శలు చేస్తూ.. తెలంగాణనే బెస్ట్.. అని చెబుతోంది. ఎవరైనా ఏపీ వైపు రావాలంటే… అసెంబ్లీలో ప్రభుత్వం మాటలు విని.. మరో వైపు చూడకుండా.. తెలంగాణకు వెళ్లిపోవడం ఖాయమని చెప్పుకోవచ్చు.

తెలంగాణ విధానాలపై ఏపీ అసెంబ్లీలో ప్రస్తావనెందుకు..?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వంపై ఏ మాత్రం సానుకూల దృక్పథం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీకి లేనందున.. అన్నీ తప్పులే కనిపిస్తాయి. అది సహజం. కానీ.. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు.. ఎన్నయినా చెప్పొచ్చు. కానీ అధికారపక్షంగా మారిన తర్వాత రాష్ట్రంపై బాధ్యత వస్తుంది. ప్రయోజనాలను కాపాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏపీలో మంచి భవిష్యత్ ఉంటుందని.. ప్రజలకు.. రైతులకు… మాత్రమే కాదు.. పెట్టుబడిదారులకూ నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. కానీ.. ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోంది. పదే పదే తెలంగాణను పొడిగేస్తోంది. అక్కడంతా సూపర్ అని.. అభినందించేస్తున్నారు. ఇది.. సాక్షాత్తూ.. ముఖ్యమంత్రి నుంచి.. మంత్రుల వరకూ సాగుతోంది.

తెలంగాణలో అంతా బాగుంది..! అక్కడికి వెళ్లిపొమ్మంటున్నారా..?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించింది. అంత వరకూ ఉంటే బాగుంటుందేమో కానీ.. ఆయన దయాదాక్షిణ్యాలు లేకపోతే.. ఏపీకి నీళ్లు రావన్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఏపీతో సఖ్యతగా ఉండటం ఏపీ ప్రజల అదృష్టం అని చెబుతున్నారు. అదే మహాప్రసాదం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన మనసెరిగారేమో కానీ… మంత్రులు కూడా… తమ ప్రసంగాల్లో తెలంగాణను ఏపీతో పోలుస్తున్నారు. తెలంగాణలోనే అంతా బాగుందంటున్నారు. ఇదే చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. అసెంబ్లీ వేదికగా.. తెలంగాణకు ప్రచారం చేయడం .. ఏపీని తక్కువ చేయడం ఏమిటన్న చర్చ సామాన్యుల్లో ప్రారంభమయింది.

తెలంగాణకు వెళ్లమని ఐటీ కంపెనీలకు ఐటీ మంత్రి సందేశం..!

నిన్న అసెంబ్లీలో మట్లాడిన.. ఏపీ ఐటీ మంత్రి గౌతంరెడ్డి… ఏపీ ఐటీ పాలసీపై.. తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు క్లిష్టంగా ఉందని.. అదంతా అక్రమాల పుట్టన్నారు. టీడీపీ తెచ్చిన పాలసీపై… వైసీపీకి నమ్మకం లేకపోతే.. పోవచ్చు … అంతటితో ఆయన ఆగిపోతే బాగుండేది.. కానీ తెలంగాణ ఐటీ పాలసీ గురించి మాట్లాడారు. వారి పాలసీకి ప్రచారం చేశారు. అక్కడ పాలసీ ఉద్భుతంగా ఉందని… విడమర్చి చెప్పారు. మంత్రి గౌతంరెడ్డి ప్రసంగం వింటున్న ప్రతి ఒక్కరికి… ఇది తెలంగాణ అసెంబ్లీనా.. ఏపీ అసెంబ్లీనా.. అన్న అనుమానం వచ్చే ఉంటుంది. అంతగా ఆయన తెలంగాణ ఐటీపాలసీని ప్రశంసించారు. ఓ మంత్రి… తమ రాష్ట్రం కన్నా.. పొరుగు రాష్ట్ర ఐటీ పాలసీనే బాగుందని ప్రశంసిస్తే.. ఏపీకి వచ్చే ఒకటి, అరా కంపెనీలయినా వస్తాయా..? ఈ మాత్రం మంత్రి ఆలోచించరా.. లేక అందుకే ఈ ప్రసంగం చేశారా…?

వైసీపీ ఇంకా ప్రతిపక్ష మూడ్‌లోనే ఉంది. ఏపీ విధానాలను విమర్శించడం అంటే.. టీడీపీని విమర్శించడం.. అనే భావనలో ఉన్నారు. కానీ.. టీడీపీ అనేది ఇప్పుడు ప్రతిపక్షం. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఏం చేసినా.. ప్రభుత్వ పరంగా చేసినదవుతుంది. ఆ పనులను తక్కువ చేసి చూపితే.. అంతిమంగా ఏపీకే నష్టం జరుగుతోంది. ఈ కనీస ఆలోచన కూడా అధికారపక్షం చేయకుండా… పొరుగు రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close