సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ ..!

ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్.. సెర్బియా పోలీసుల అదుపులో ఉన్నారు. విహారయాత్రకు ఆ దేశం వెళ్లిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను.. బెల్‌గ్రేడ్‌లో పోలీసులు అనూహ్యంగా అరెస్ట్ చేశారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాన్‌పిక్ పోర్టు ప్రాజెక్ట్ విషయంలో.. తమను మోసం చేశారని రస్‌ అల్‌ ఖైమా సంస్థ ఫిర్యాదు మేరకే… సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రాథమికంగా వెల్లడవుతున్న సమచారం., ముందుగా… నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన విషయం.., వైసీపీ నేతలకే తెలిసింది. వెంటనే.. వైసీపీ ఎంపీలు.. ఆయనను విడిపించేందుకు .. భారత ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌కు.. ఉన్న పళంగా లేఖ రాశారు. సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ ప్రసాద్ ఉన్నారని.. దౌత్య పరంగా .., సెర్బియా అధికారులతో చర్చించి.. విడిపించాలని లేఖలో కోరినట్లు తెలుస్తోంది.

నిమ్మగడ్డ ప్రసాద్ ను … సెర్బియాలో అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం .. వాన్ పిక్ పోర్ట్ అంటున్నారు. ఈ పోర్టును… గల్ఫ్ లోని ఓ చిన్న దేశం అయిన రస్ అల్ ఖైమా తో కలిసి… నిమ్మగడ్డ ప్రసాద్.. జాయింట్ వెంచర్ గా ప్రారంభించారు. వాడరేవు, నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ ( వాన్ పిక్ ) సంస్థను ప్రారంభించారు. దీనికి అప్పటి ప్రభుత్వం 24 వేల ఎకరాలు కేటాయించింది. అయితే ఈ కేటాయింపుల వెనుక క్విడ్ ప్రో కో ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేటాయింపుల తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టారని సీబీఐ కేసులు నమోదు చేసింది. దాదాపుగా రూ. 850 కోట్లను.. నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ సంస్థల్లోకి పెట్టుబడులుగా పెట్టారు.

తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం… వాన్‌పిక్‌ భూములపై అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. ఈ ఉపసంఘం వానపిక్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సూచించింది. మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ కూడా వానపిక్‌ కన్సార్షియంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దాంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. అయితే.. తాము పెట్టిన పెట్టుబడిలో.. నిమ్మగడ్డ ప్రసాద్ మోసం చేశారని.. రస్ అల్ ఖైమా ప్రతినిధులు… ఫిర్యాదు చేయడంతోనే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close