నిమ్మగడ్డకు అక్కడా షరతుల బెయిలే..!

జగన్ అక్రమాస్తుల కేసులో.. షరతులతో కూడిన బెయిల్‌ మీద ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ .. సెర్బియాలోనూ అదే తరహా బెయిల్ పొందారు. వాన్‌పిక్ ప్రాజెక్ట్ పేరుతో “రస్ అల్ ఖైమా”ను మోసం చేసిన కేసులో ఆయనను ఇంటర్ పోల్ పోలీసులు సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఐదు రోజులుగా ఆయనను.. పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సెర్బియా చట్టాల ప్రకారం.. ఆయన తరపు న్యాయవాదులు .. అక్కడ బెయిల్ పిటిషన్‌ దాఖలు చేయడంతో… ఆ మేరకు అక్కడి కోర్టు అవకాశం ఇచ్చింది. బెయిల్ మంజూరు చేసింది. కానీ.. సెర్బియా దాటి వెళ్లకూడదని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి విచారణ పూర్తయ్యే వరకూ.. సెర్బియాలోనే ఉండాలని స్పష్టం చేసింది. దీంతో.. నిమ్మగడ్డకు.. బెయిల్ లభించినప్పటికీ.. సెర్బియాలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరో వైపు రస్ అల్ ఖైమా… ప్రభుత్వం.. నిమ్మగడ్డను.. తమ దేశానికి అప్పగించాలని కోరుతూ.. సెర్బియా ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. తమను మోసం చేశారని.. తమ వద్ద నమోదైన కేసుల వివరాలతో.. సెర్బియాకు విజ్ఞాపన పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది. గల్ఫ్ దేశాలతో యూరప్‌కు నేరస్తుల అప్పగింత ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందాల ఆధారంగా.. నిమ్మగడ్డ ప్రసాద్‌ను తమ దేశానికి తరలించేందుకు రస్ అల్ ఖైమా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు.. సెర్బియా చట్టాల ప్రకారం.. నిమ్మగడ్డకు బెయిల్ వచ్చినప్పటికీ… అక్కడి నుంచి.. స్వదేశానికి చేరుకోవడం అంత తేలిక కాదన్న అభిప్రాయం.. న్యాయనిపుణుల్లో ఉంది.

నిమ్మగడ్డ ప్రసాద్… ఇండియా నుంచి విదేశాలకు వెళ్లడానికి కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి ఇస్తేనే ఆయన విదేశాలకు వెళ్లాలి. అలా పర్మిషన్ తీసుకునే ఆయన సెర్బియాకు విహారయాత్రకు వెళ్లారు. కానీ ఇప్పుడు.. అక్కడ ఇరుక్కుపోయారు. హైదరాబాద్ సీబీఐ కోర్టులో జమ చేసిన పాస్‌పోర్టును తీసుకుని… సెర్బియా వెళ్తే.. ఇప్పుడు అక్కడి పోలీసులు ఆ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇండియా రావాలంటే.. అక్కడి కోర్టు మళ్లీ అనుమతి ఇచ్చి పాస్‌పోర్టు అంగీకరించాలి. నిమ్మగడ్డ పరిస్థితి ఎక్కడికి వెళ్లినా… కోర్టు అనుమతి ద్వారానే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

వంద కోట్ల వెబ్ సిరీస్ ఏమైంది రాజ‌మౌళీ?!

బాహుబ‌లి ఇప్పుడు యానిమేష‌న్ రూపంలో వ‌చ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే 'బాహుబ‌లి' సినిమాకీ ఈ క‌థ‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ పాత్ర‌ల‌తో,...

గుంటూరు లోక్‌సభ రివ్యూ : వన్ అండ్ ఓన్లీ పెమ్మసాని !

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుంచి ఓ అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కారణం వైసీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి వెనకడుగు వేయడం....

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close