హైద‌రాబాద్ లో చాలా కాళేశ్వ‌రాలున్నాయ‌న్న విజ‌యశాంతి!

తెలంగాణ నీటి అవ‌స‌రాల‌కు తిరుగులేని, త‌రుగులేని ప్రాజెక్టుగా కాళేశ్వ‌రాన్ని నిర్మించామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. గ‌త పాల‌కుల చేతుల్లో ఈ ప్రాజెక్టు ఉంటే నిర్మాణానికి ఇర‌వ‌య్యేళ్లు ప‌ట్టేద‌న్నారు. డిజైన్ మార్చి, బుర్ర ఉప‌యోగించి ఈ క‌ల‌ను సారాకారం చేసుకున్నామ‌న్నారు. తాను గోదావ‌రి మీదుగా ఎప్పుడు వెళ్లినా, కారు ఆపి చిల్ల‌ర డ‌బ్బులేసి మొక్కేవాడిన‌ని, ఆ కోరిక నెర‌వేరింద‌న్నారు కేసీఆర్. అయితే, ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌ల‌పై సెటైర్ వేశారు టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ ఛైర్ ప‌ర్స‌న్ విజ‌య‌శాంతి.

వేల కోట్ల ఖ‌ర్చుతో ఒక్క కాళేశ్వ‌రం క‌ట్టామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ గొప్పలు చెబుతున్నార‌నీ, హైద‌రాబాద్ రోడ్ల మీదికి ఇప్పుడు ఒక్క‌సారి వెళ్లి చూస్తూ… అలాంటి కాళేశ్వ‌రాలు అడుగుకొక‌టి చొప్పున క‌నిపిస్తుంటాయ‌ని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు విజ‌యశాంతి. వ‌ర‌ద నీరు రావ‌డంతో ప్రాజెక్టులు క‌ళ‌క‌ళ‌లాడుతాయ‌నీ, అలాగే హైద‌రాబాద్ లో కూడా వాన నీటితో రోడ్ల మీద గుంత‌ల‌న్నీ నీటితో నిండిపోయి, బుర‌ద‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయ‌ని ఎద్దేవా చేశారు. ఎక్క‌డ ఏ స‌మ‌స్య ఉన్నా గ‌త పాల‌కుల‌దే త‌ప్పు అన్న‌ట్టు మాట్లాడుతూ… వారు నిర్వ‌హించాల్సిన బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటార‌ని విమ‌ర్శించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో మురునీటిని వ్య‌వ‌స్థ‌పై, న‌గ‌రంలో రోడ్ల‌పై ఏనాడైనా శ్ర‌ద్ధ పెట్టారా అని ప్ర‌శ్నించారు.

విజ‌య‌శాంతి విమ‌ర్శ‌ల్లో ఒక‌టైతే వాస్త‌వం… గ‌త ‌వారం రోజులుగా హైద‌రాబాద్ లో పడుతున్న వ‌ర్షాల వ‌ల్ల రోడ్లు చాలావ‌ర‌కూ పాడైపోయాయి. కాల‌నీల్లో మురునీరు రోడ్ల మీదికి వ‌స్తోంది. ఇక ట్రాఫిక్ జామ్ లు చెప్పాల్సిన ప‌నేలేదు! గ‌డ‌చిన వారం రోజులుగా ఉద‌య‌మూ సాయంత్ర‌మూ హైటెక్ సిటీ మొద‌లుకొని, పంజాగుట్ట వ‌ర‌కూ ట్రాఫిక్ క‌ష్టాలు తీవ్రంగా ఉన్నాయి. గ‌తంలో… రోడ్ల మీద గుంత క‌నిపిస్తే ఒక‌ప్పుకోన‌నీ, తాను అన్ని రోడ్లపై ప‌ర్య‌టించి మ‌రీ స‌మ‌స్య‌ల్ని చూస్తాన‌ని కేటీఆర్ అన్నారు. కొద్దిరోజులు అలానే వ‌ర్షం ప‌డుతున్న స‌మ‌యంలో కూడా ఆయ‌న రోడ్ల మీద‌కి వ‌చ్చారు. దాంతో, వ‌ర్షాకాలంలో రోజువారీ స‌మ‌స్య‌ల‌కి ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని అప్పుడు అంద‌రూ ఆశించారు. అది కొద్దిరోజుల హ‌డావుడిగానే ముగిసిపోయింది. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ల గురించి, మురికి కాల్వ‌లు పొంగి పొర్లుతున్న ప‌రిస్థితి గురించి నాయ‌కులేం మాట్లాడ‌టం లేదు! ప్ర‌స్తుతం ద‌గ్గ‌ర్లో గ్రేట‌ర్ తప్ప వేరే ఎన్నిక‌లు లేవు. ఏమో, ఆ ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చాక‌… న‌గ‌ర ప్ర‌జ‌ల క‌ష్టాలు నాయ‌కుల‌కు గుర్తొచ్చేస్తాయేమో!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close