“ఔట్‌రీచ్‌”లో ఏపీ ఆల్ అవుట్..!

” మా దగ్గర మెట్రో సిటీల్లేవు…”
“మాది పేద రాష్ట్రం. మా దగ్గర పెద్దగా మౌలిక సదుపాయాల్లేవు..”
” మా దగ్గర పరిశ్రమలు పెడితే స్థానికులకు 75 శాతం ఉద్యోగాలివ్వాలి…”
“రాష్ట్ర ప్రయోజనం కోసం పెట్టుబడులు పెట్టినా.. మధ్య ఒప్పందాలు రద్దు చేసుకుంటాం..!” .. ఇలాంటివన్నీ.. ఏదైనా రాజకీయ పార్టీ .. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడొచ్చు కానీ.. పెట్టుబడుల కోసం ఉద్దేశించిన సభల్లో… హైలెట్ చేయరు. ఎందుకంటే.. ఎవరు.. ఏ ప్రభుత్వాధినేత…అయినా… పెట్టుబడుల కోసం సమావేశం నిర్వహిస్తే.. మైనస్ పాయింట్లన్నింటినీ.. వీలైనంతగా ప్లస్ పాయింట్లుగా చెప్పుకునేందుకు ప్రయత్నించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తారు. కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి భిన్నం.. ఆంధ్రప్రదేశ్‌ ఇమేజ్ తగ్గించేలా వ్యాఖ్యలు చేస్తూ.. రాయబారుల సదస్సులో ప్రసంగించారనే విమర్శలు వస్తున్నాయి.

పీపీఏల రద్దుపై ఘనంగా చెప్పుకున్న జగన్..!

రాయబారుల సదస్సులో సీఎం జగన్మోహన్ రెడ్డి పీపీఏలను రద్దు చేయడాన్ని ఘనంగా చెప్పుకున్నారు. తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం అలా చేయక తప్పలేదన్నారు. ఈ పీపీఏలు రద్దు చేయడం వల్ల… అంతర్జాతీయంగా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, పారిశ్రామిక సంస్థలు నష్టపోతాయని.. అయినా.. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఈ మాటలు విన్న ఎవరైనా… ఏపీలో ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టడానికైనా… ముందు వెనుకా ఆలోచిస్తారు. రేపు వేల కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత తమకు ఇదే పరిస్థితి ఎదురవ్వదనే గ్యారంటీ ఏముందనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఇప్పటికే.. పీపీఏల రద్దుపై… అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు మైనస్ పాయింట్లిస్తున్నాయి. పోలవరంలో బెకమ్ అనే ఫ్రాన్స్ సంస్థ గేట్లు నిర్మిస్తూంటే… కాంట్రాక్ట్ రద్దు చేశారు. అంతర్జాతీయంగా.. ఏపీపై ఓ ఇమేజ్ పడుతున్న సమయంలో.. జగన్.. మీరు ఏపీకి వస్తే… పీపీఏల గతి పట్టినా ఆశ్చర్యం లేదన్న అర్థంలో ప్రసంగించడం.. చాలా మంది రాయబారులను సైతం ఆశ్చర్య పరిచింది.

75 శాతం ఉద్యోగాలపై వింత సమర్థన..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానికులకే 75 శాతం ఇవ్వాలనే బిల్లును చట్టం చేసింది. ఏ పరిశ్రమ పెట్టాలన్నా.. ఇక నుంచి ఆ నిబంధన వర్తిస్తుంది. ఇది వివాదాస్పదమేనని.. సీఎం జగన్ కూడా అంగీకరించారు. అమెరికానే కాదు.. ప్రపంచ దేశాల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలపై చర్చ జరుగుతోందని.. పరిశ్రమ పెట్టేవాళ్లు.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాల్సిందేనని జగన్ తేల్చేశారు. కావాలంటే.. వారికి కావాల్సిన నైపుణ్యం ఉన్న ఉద్యోగుల్ని.. ఏపీ ఇంజినీరింగ్ కాలేజీల్లో… తీర్చిదిద్దుతారట. ప్రైవేటు పరిశ్రమల్లో ఉద్యోగం అంటే నైపుణ్యం ఉండి తీరాలి. అనుభవం ఉన్న ఉద్యోగులు కావాలి. ఈ నైపుణ్యాలు కావాలంటే.. కావాల్సిన చోట నుంచి ఉద్యోగుల్ని తెచ్చుకునే వెసులుబాటు ఉంటేనే పెట్టుబడులకు ఆసక్తి చూపుతారు. పారిశ్రామికవేత్తలకు ప్రాంతాలపై అభిమానం ఉండదు. తమ ఉత్పత్తులు బాగా రావాలంటే.. వారికి కావాల్సింది నైపుణ్యం ఉన్న ఉద్యోగులే.

ఏపీకి ఉన్న ప్లస్‌పాయింట్లను తక్కువ చేయడం ఎందుకు..?

ఏపీలో ఉన్న నాలుగు ఎయిర్ పోర్టులు.. ఆరు పోర్టులే తమ బలం అని జగన్మోహన్ రెడ్డి.. ఒక్క మాటతో ఏపీ బలం తేల్చి పడేశారు. నిజానికి… ఏపీలో ఉన్న వనరులకు కొదువ లేదు. కియా లాంటి పరిశ్రమలు… కరువు జిల్లా అనంతపురంకు వచ్చి… రెండేళ్లలోనే ఉత్పత్తి ప్రారంభించగలిగినప్పుడు.. ఎలాంటి పరిశ్రమ అయినా… ఏపీలో .. నిలదొక్కుకోగలదు. కానీ.. ఏపీ సర్కార్ రాయబారులకు.. తమ బలాల విషయంలో.. ప్రజెంటేషన్ ఇవ్వడంలో ఘోరంగా విఫలమయింది. ఈ సదస్సులో పాల్గొన్న రాయబారులు.. ఏ సందర్భంలో అయినా.. తమ దేశ పెట్టుబడిదారులకు… సలహా ఇవ్వాలంటే.. కచ్చితంగా.. ఏపీని మాత్రం .. చవరి ప్రాధాన్యతగా పెట్టుకుంటారన్న విమర్శలు గేట్‌వే హోటల్‌లోనే వినిపించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close