అందుకేనా.. కె.విశ్వనాథ్‌తో కేసీఆర్ భేటీ ..?

తెలంగాణ సీఎం కేసీఆర్ .. హఠాత్తుగా దిగ్గజ దర్శకుడు.. కె.విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు. ఎందుకు వెళ్లాలో ఎవరికీ తెలియదు. దాంతో.. కె.విశ్వనాథ్ ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే వెళ్లి కలిశారని ప్రచారం జరిగింది. అయితే.. ఓ వీడియో విడుదల చేసి.. దర్శక దిగ్గజం.. ఆ అనుమానాలకు చెక్ చెప్పారు. కేసీఆర్ వ్యక్తిగత పని మీద వచ్చి కలిశారని వివరణ ఇచ్చారు. అయితే.. కే.విశ్వనాథ్‌తో కేసీఆర్ వ్యక్తిగత పనేమిటా..అనేది చాలా మందికి ఉన్న అనుమానం. కేసీఆర్‌ వ్యక్తిగత పని మీద కాదని.. ఓ గొప్ప ఆలోచనపై విశ్వనాథ్ సలహాలు పొందేందుకు.. ఆయనింటికి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్… కోటి ఎకరాలను.. నీరందించి… తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా చేయాలనుకుంటున్నారు. అందుకే.. భారీ ఎత్తున కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులను చేపట్టారు. ఇప్పుడు… అవన్నీ… ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. కాళేశ్వరంలో కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి కూడా. ఇప్పుడు.. వాటికి చరిత్రలో నిలిచిపోయేలా.. ప్రజల మనసుల్లో ముద్రపడేలా పేర్లు పెట్టాలనుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజ్‌లు, పంపుహౌజులకు దేవతల పేర్లను పెట్టాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు లక్ష్మీ , అన్నారం బారాజ్‌కు సరస్వతి , సుందిళ్ల బారాజ్‌కు పార్వతి, నందిమేడారం రిజర్వాయర్‌ కమ్‌ పంప్‌హౌజ్‌కు నంది, లక్ష్మీపురం పంప్‌హౌజ్‌కు గాయత్రి అనే పేర్లను అనుకుంటున్నారు.

సాధారణంగా… ప్రభుత్వం తరపున ఏదైనా పెద్ద భవంతినో.. ప్రాజెక్టులో కడితే.. రాజకీయ నేతల పేర్లే పెట్టేస్తూంటారు. అవి వివాదాస్పదమవుతూ ఉంటాయి.కానీ కేసీఆర్ మాత్రం.. ప్రాజెక్టులపై అలాంటి రాజకీయ మరక పడకూడదని అనుకుంటున్నారు. గతంలోనే.. కీలక ప్రాజెక్టులకు స్థానిక దేవాలయాల్లో కొలువైన దేవుళ్ల పేర్లే పెడతామని ప్రకటించారు. ఇప్పుడు భక్త రామదాసు ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు సైతం స్థానిక పుణ్యక్షేత్రం ఆధారంగానే నామకరణం చేశారు. ఇలాంటి విషయంలో… కే.విశ్వనాథ్ సలహాలు బాగుంటాయన్న ఉద్దేశంతో ఆయనను కలిసినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విశ్వనాథ్ సలహాలతో.. తెలంగాణలో.. ప్రాజెక్టుల స్వరూపానికి ఓ కవితాత్మక రూపం వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరి కేసీఆర్ .. ఇదే అజెండాతో.. విశ్వనాథ్ ను కలిశారా.. లేక ఇంకేమైనా విషయమా అనేది.. అధికారిక ప్రకటన వస్తేనే కానీ తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close