పోలవరం రివర్స్ టెండరింగ్ అక్కర్లేదన్న కేంద్రం..!

పోలవరం ప్రాజెక్ట్ రీ టెండరింగ్ సరికాదని.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ఏపీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టులను అర్థంతరంగా రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ తప్పు పట్టింది. సమర్థవంతంగా పని చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థలను ఉన్నపళంగా తప్పించడం సరి కాదని.. పీపీఏ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రివర్స్ టెండరింగ్ వల్ల… ప్రాజెక్ట్ వ్యయం పెరగడంతో పాటు.. ఆలస్యం కూడా అవుతందని.. పీపీ ఏ సమావేశం అభిప్రాయపడింది. రివర్స్‌ టెండరింగ్‌ సరికాదని ఆ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందేనని.. పీపీఏ మొహమాటం లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు.. హైదరాబాద్ లో జరిగిన పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సమావేశం తర్వాత అధికారిక ప్రకటన విడుదల చేశారు.

పీపీఏ సమావేశంలో జలవనరుల శాఖ అధికారులు.. నిపుణుల కమిటీ నివేదికను..దగ్గర పెట్టుకుని రివర్స్ టెండరింగ్ ఆవశ్యకతను వివరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే.. అవకతవకలు… జరిగాయని… ఏపీ ఇరిగేషన్ అధికారులు సమర్థంగా వాదించలేకపోయారు. దానికి కారణం.. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి తీసుకున్న ప్రతి నిర్ణయం.. పీపీఏ ద్వారానే జరిగింది. నవయుగ కంపెనీకి కానీ.. గేట్లు తయారు చేసే బెకం కంపెనీనికి కానీ సబ్ కాంట్రాక్టులు … పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ద్వారానే అందాయి. ఈ కారణంగా.. వాటిలో అవినీతి జరిగిందని..నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిందని.. ఏపీ అధికారులు వాదించలేకపోయారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. కేవలం నిర్మాణ బాధ్యతుల మాత్రమే ఏపీ సర్కార్ పై ఉన్నాయి. ప్రతీ రూపాయి కేంద్రమే ఇస్తుంది. నిర్మాణ వ్యవహారాలను.. ఖర్చు పెట్టిన నిధులను రీఎంబర్స్ చేసుకోవాలన్నా… ప్రత్యేకంగా… ప్రాజెక్టుకు సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్నా కచ్చితంగా… పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ అనుమతి ఉండాల్సిందే.

లేకపోతే…. పనులు ముందుకు జరగవు. అయితే.. ఏపీ సర్కార్ మాత్రం… ముందస్తుగా… ఎలాంటి సమాచరం పీపీఏకు ఇవ్వకుండా.. నవయుగతో పాటు.. ఇతర కంపెనీలకు కాంట్రాక్ట్ టెర్మినేషన్ నోటీసులు ఇచ్చింది. కేంద్రమంత్రి పార్లమెంట్ లో కూడా.. కాంట్రాక్టులను రద్దు చేయడాన్ని… దుంఖకరమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఇలా కేంద్రం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ సర్కార్… నిపుణుల కమిటీ ని నియమించి.. ముందు నుంచి తాము చెబుతున్న అంశాలతోనే.. నివేదిక వచ్చేలా చేసుకుని.. టార్గెట్ చేసుకున్న కాంట్రాక్ట్ కంపెనీలను పోలవరం పనుల నుంచి బయటకు పంపేసిందనే.. ఆరోపణలు కొద్ది రోజులుగా వస్తున్నాయి. ఈ క్రమంలో పీపీఏ హెచ్చరికలు ఆసక్తికరంగా మారాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close