డ్రోన్ల వ‌ల్ల‌ భ‌ద్ర‌త‌కు వ‌చ్చిన న‌ష్ట‌మేంట‌న్న మంత్రి అనిల్!

ప్ర‌తిప‌క్ష‌నేత నారా చంద్ర‌బాబు నాయుడు ఇంటి ప్రాంతంలో డ్రోన్ కెమెరాల క‌ల‌క‌లం తెలిసిందే. ఆ కెమెరాల‌ను పట్టుకుని వ‌చ్చిన‌వారి ద‌గ్గ‌ర క‌నీసం గుర్తింపులు కార్డులుగానీ, అనుమ‌తి లేఖ కూడా లేద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. చంద్ర‌బాబు నాయుడుకి జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ ఉంది కాబ‌ట్టి, అనుమ‌తి లేకుండా ఇలాంటివి చేయ‌కూడ‌ద‌ని చెబుతున్నారు. అయితే, ఈ డ్రోన్ కెమెరాల‌పై మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ స్పందించారు. ఆయ‌న ఒక్క ఇంటినే తీయాలంటూ డ్రోన్ల‌ను పంపించ‌లేద‌నీ, వ‌ర‌ద పోటు నేప‌థ్యంలో ప‌రిస్థితిని తెలుసుకోవ‌డం కోసం విజువ‌ల్స్ తీయ‌మ‌ని ఒక ఏజెన్సీకి చెప్పామ‌న్నారు. భ‌వానీ ఐలండ్ తో స‌హా ఎడ‌మ‌, కుడి ప్రాంతాల‌ను మొత్తం క‌వ‌ర్ చేయ‌మ‌న్నామ‌న్నారు. దాన్లో చంద్ర‌బాబు నాయుడు ఇల్లుంద‌నీ, అంతేగానీ ఆయ‌న ఇంటిపైనే ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టి విజువ‌ల్స్ తీయాల్సిన అవ‌స‌రం ఏముంటుంద‌ని మంత్రి అన్నారు.

ఒక‌వేళ రేప్పొద్దున ఆయ‌న ఇల్లు పూర్తిగా మునిగిందే అనుకుందాం… అప్పుడేమంటారూ, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి ఇల్లు వ‌రద‌లో మునిగిపోతున్నా వైకాపా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాళ్లే విమ‌ర్శ‌లు చేస్తార‌న్నారు. అక్క‌డికి నీళ్లు రాక‌పోతే ఇసుక బ‌స్తాలు ఎందుకు వేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. అంటే, మీరు ప్ర‌మాద ప్రాంతంలో నివాసం ఉంటున్న‌ట్టే క‌దా, తాము మొద‌ట్నుంచీ చెబుతున్న‌ది నిజ‌మ‌నే క‌దా అర్థం అన్నారు. మీ ఇంటి ముందు నీరుంటే… దాన్ని బ‌య‌ట‌కి చూపించ‌కూడ‌ద‌ని ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని ప్ర‌శ్నించారు అనిల్ కుమార్. క‌ర‌క‌ట్ట మీదికి నీళ్లొచ్చాయ‌ని ప్ర‌జ‌ల‌కు తెలిసిపోతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారా అన్నారు.

ఆయ‌న అధికారంలో ఉండ‌గా ఏరోజూ వ‌ర‌ద వ‌చ్చిందీ లేద‌నీ, వ‌ర్షాలే స‌రిగా ప‌డింది లేద‌నీ, ఆయ‌న ఎప్పుడు అధికారంలో ఉన్నా అంతే ప‌రిస్థితి అని ఎద్దేవా చేశారు. ఇవాళ్ల రాష్ట్రంలో రైతులు హాయిగా ఉన్నార‌నీ, పుష్క‌లంగా నీరు వ‌స్తోంద‌నీ, దాంతో త‌మ‌కు మంచి పేరు రైతాంగంలో వ‌చ్చేస్తుంద‌న్న కుళ్లుతో అలా టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. ఒక‌వేళ‌, ఇలాంటి నీరు చంద్ర‌బాబు హ‌యాంలో వ‌చ్చి ఉంటే… ఆయ‌న ఈపాటికే కోట్లు ఖ‌ర్చుపెట్టి హార‌తులు ఇచ్చేసి ప్ర‌చారం చేసుకునేవార‌న్నారు. అలాంటి రాజ‌కీయాలు త‌మ‌కు చేత‌గావ‌ని మంత్రి అనిల్ అన్నారు. మొత్తానికి, అవి ప్ర‌భుత్వం పంపిన కెమెరాలే అని మంత్రి చెప్పారు. అయితే, జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త ఉన్న ప్రాంతంలోకి అవి వెళ్లాయి క‌దా అంటే… దాని వ‌ల్ల ఆయ‌న భ‌ద్ర‌త‌కు ఏదైనా ముప్పు వ‌చ్చిందా అనే స‌మాధానంతో మంత్రి స‌రిపెట్టేశారు.!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close