చిదంబరమూ జైలుకెళ్లక తప్పదు..!

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్టుకు రంగం సిద్ధం అయింది. మీడియా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా 305 కోట్ల రూపాయల విదేశీ నిధులు పొందడంలో చిదంబరం ప్రధాన భూమికి పోషించారని సీబీఐతో పాటు ఈడీ కూడా అరోపిస్తున్నాయి. చిదంబరం… కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తనయుడు కార్తీ చిదంబరం సిఫారసు మేరకే నిబంధనలు సడలించారని ఈడీ అంటోంది. గతేడాది చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సారి మాత్రం అలాంటి అవకాశం లేకుండా పిటీషన్‌ను కొట్టివేసింది. దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన సాక్ష్యాలను బట్టి చిదంబరం తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడ్డారని కోర్టు అంటోంది. సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునేందుకు వెసులుబాటు కలగడంతో చిదంబరం అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టారు.

సుప్రీం కోర్టులో చిదంబరం తరపున కపిల్ సిబల్.. స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఊరట లభించకపోతే.. అరెస్ట్ తప్పకపోవచ్చు. చిదంబరం కుమారుడు.. కార్తీ చిదంబరాన్ని ఇప్పటికే అరెస్టయ్యారు. బెయిల్ తెచ్చుకున్నారు. చిదంబరాన్ని బీజేపీ టార్గెట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అమిత్ షా.. ఒకప్పుడు.. కేసుల్లో ఇరుక్కోవడానికి.. చిదంబరమే కారణమనే.. బీజేపీ భావిస్తోంది. మోడీ సన్నిహితుడన్న కారణంగా.. చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు.. అమిత్ షాను వెంటాడారని చెబుతున్నారు. అందుకే.. ఇప్పుడు.. ఈ కేసు పరుగులు పెడుతోందంటున్నారు. ముందస్తు బెయిల్ ను..ఢిల్లీ హైకోర్టు అలా తిరస్కరించగానే.. అటు సీబీఐ, ఇటు ఈడీ అధికారులు.. చిదంబరం ఇంటికి చేరుకున్నారు. ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు.

చిదంబరం రాజకీయంగా కూడా.. కాంగ్రెస్ తరపున ఆయన క్రియాశీలకంగా ఉంటున్నారు. కేంద్ర బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేశాన్ని… మోడీ, షాలు దివాలా తీయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ విధానాల రూపకల్పనలో పార్టీకి చిదంబరం దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ కనీస ఆదాయ పథకానికి బ్లూ ప్రింట్‌ వెనుక చిదంబరం కృషి ఉందని చెబుతారు. చిదంబరాన్ని జైలుకు పంపాలని.. చాలా కాలంగా… సీబీఐ, ఈడీ చేస్తున్న ప్రయత్నాలు.. ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close