ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు మళ్లీ ఊపందుకోవడంతో, మంగళగిరి ప్రాంతం రాష్ట్రానికే ఒక నూతన సైబర్ సిటీ గా మారుతోంది. ప్రభుత్వం ఐటీ రంగాన్ని ఒక గ్రోత్ ఇంజిన్‌గా గుర్తించి, మంగళగిరిని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే ఇక్కడ పలు ఐటీ టవర్లు, డేటా సెంటర్లు, బీపీఓ కేపీఓ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి.
మంగళగిరి వ్యూహాత్మక భౌగోళిక స్థానం దీని అభివృద్ధికి ప్రధాన కారణం. విజయవాడ , గుంటూరు నగరాలకు మధ్యలో ఉండటం, జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం వల్ల రవాణా సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడ ఉండటంతో నివాస ప్రాంతంగా కూడా దీనికి డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల ప్రభుత్వం ఇక్కడ క్వాంటం వ్యాలీ’ వంటి అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టడం విశేషం.
ఈ మౌలిక సదుపాయాల కల్పన , ఐటీ కంపెనీల రాకతో మంగళగిరి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా పుంజుకుంది. గడిచిన కొద్ది నెలల్లోనే భూముల ధరలు , అపార్ట్మెంట్ల విలువలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ విల్లా ప్రాజెక్టులు ఇక్కడ క్యూ కడుతున్నాయి. పెట్టుబడిదారులు , సాఫ్ట్వేర్ నిపుణులు ఈ ప్రాంతాన్ని సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి కేంద్రంగా చూస్తుండటంతో, మంగళగిరి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పటంలో కీలక శక్తిగా ఎదిగేందుకు సిద్ధమవుతోంది.


