‘పెద్ది’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ లైనప్ ఇప్పటికే క్లియర్‌గా కనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉంది. అయితే బుచ్చిబాబుకు కొత్త ప్రాజెక్ట్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం ఆయన వద్ద ఒక మంచి కథ సిద్ధంగా ఉంది. అయితే ఆ కథ ఎవరితో చేయాలనేది ఇంకా ఫైనల్ కాలేదు.
నిజానికి ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు మొదట ఎన్టీఆర్‌కు కథ చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోవడంతో బుచ్చిబాబు రామ్ చరణ్ వైపు వచ్చారు. ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసుకున్న కథనే చరణ్‌తో చేశారని వార్తలు కూడా వచ్చాయి. కానీ బుచ్చి వాటిని స్వయంగా తోసిపుచ్చారు. ఎన్టీఆర్ కోసం వేరే కథ చేశానని, ఆయన పిలిస్తే వెంటనే వెళ్లి కథ చెబుతానని చెప్పారు.
ఎన్టీఆర్‌పై బుచ్చికి ఆశలు ఉన్నాయి. ఎన్టీఆర్ లైనప్‌ను గమనిస్తే, ఆయన చాలా కాలం వరకు బిజీగా ఉండబోతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేయడం దాదాపు ఖాయం. అలాగే ‘దేవర 2’ కూడా లైన్లో ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే సరికి మరికొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.
అయితే బుచ్చిబాబు మనసులో మాత్రం ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనే కోరిక బలంగానే ఉంది. ‘పెద్ది’ ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే బుచ్చిబాబు స్థాయి ఒక్కసారిగా మారిపోతుంది. ఇప్పటికే ‘ఉప్పెన’తో తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో భారీ విజయం అందుకుంటే టాప్ లీగ్‌లోకి వెళ్తారు.
ప్రస్తుతం అందరి చూపు ‘పెద్ది’ మీదే ఉంది. బుచ్చిబాబు ఎలాంటి కథ చెప్పాడు? రామ్ చరణ్‌ను ఎలా ప్రెజెంట్ చేశాడు? అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరుకుతుంది. ఒకవేళ సినిమా అంచనాలను అందుకుని భారీ విజయం సాధిస్తే, బుచ్చిబాబు కెరీర్లో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆ కొత్త అధ్యాయంలో ఎన్టీఆర్‌తో సినిమా కూడా ఉండొచ్చు.
