జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ జనవరి 6 వ తేదీన అనారోగ్యంతో మరణించారు కానీ నేటికీ ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవలేదు. ఇంతవరకు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ-పిడిపిల మధ్య అవగాహన కుదరకపోవడం వలననే ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం జరుగుతోంది. అసలు బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిడిపి అధినేత్రి మహబూబా ముఫ్తీ మొదటి నుంచి అయిష్టంగానే ఉన్నారు. బహుశః ఆ కారణంగానే ఏవో సాకులు చెపుతూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. అందుకు విమర్శలు ఎదుర్కోవలసి వస్తుండటంతో, స్వర్గీయ ముఫ్తీ మొహమ్మద్ ఆకాంక్షలకు అనుగుణంగా రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందాన్ని కేంద్రప్రభుత్వం యధాతధంగా అంగీకరించితే తాము ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దంగా ఉన్నామని ప్రకటించింది. కానీ దానికి బీజేపీ నుండి ఎటువంటి స్పందన రాలేదు.

వాటి మధ్య ఏమి ఒప్పందం జరిగిందో, దానిలో ఏమేమి షరతులున్నాయో కేవలం ఆ రెండు పార్టీలకు మాత్రమే తెలుసు. దానిలో మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ‘పాక్ పట్ల భారత్ అనుసరించవలసిన విదేశీ విధానం’ వంటి షరతులు కూడా ఉన్నందునేమో బీజేపీ స్పందించలేదు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతున్న కొద్దీ పిడిపి అధిష్టానంపై పార్టీ ఎమ్మెల్యేల నుండి ఒత్తిడి పెరుగుతుండటం చాలా సహజం. బహుశః అందుకే పిడిపి నిన్న మళ్ళీ మరొక ప్రకటన చేసింది. రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందాన్ని మోడీ ప్రభుత్వం అమలుచేస్తుందని నమ్మకం కలిగించే చర్యలు చేపడితే తాము ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దంగా ఉన్నామని ఆ పార్టీ అధికార ప్రతినిధి నయీం అక్తర్ నిన్న మీడియాకు తెలిపారు. అయితే మోడీ ప్రభుత్వం నుంచి తమ పార్టీ ఏమి ఆశిస్తోందో ఆయన నిర్దిష్టంగా చెప్పలేదు. పిడిపి ఏమి ఆశిస్తోందో కేంద్రప్రభుత్వానికి తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా స్పందించలేదు. అయితే ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో పడేసి పిడిపి చేతులు దులుపుకొంది కనుక బీజేపీ కూడా తప్పక స్పందించాల్సి ఉంటుంది.
బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అయిష్టత ప్రదర్శిస్తూనే మళ్ళీ దానితోనే కలిసి పనిచేయాలని పిడిపి ఎందుకు సిద్దం అవుతోంది? ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నప్పటికీ బీజేపీతోనే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎందుకు కోరుకొంతోంది? అనే సందేహాలకు సమాధానం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటమేనని చెప్పవచ్చును.
పిడిపి పెడుతున్న షరతులను కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీర్చగలదేమో కానీ కాంగ్రెస్ పార్టీ తీర్చలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని రాష్ట్రంలో పిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రం సహకారం లేనిదే పాలన చేయడం చాలా కష్టం. కనుక పిడిపికి బీజేపీ తప్ప వేరే గత్యంతరం లేదు. మరికొన్ని రోజులు ఆగినట్లయితే పిడిపి అధిష్టానంపై పార్టీ ఎమ్మెల్యేల నుండి ఇంకా ఒత్తిడి పెరిగిపోతుంది. అప్పుడు పిడిపి తనంతట తానుగా షరతులన్నిటినీ పక్కన పెట్టి మద్దతు ఇస్తే చాలని బీజేపీని కోరినా ఆశ్చర్యం లేదు. బహుశః అందుకే ఇప్పుడు బీజేపీ తాపీగా కూర్చొందేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close