శ‌ర్వా మ‌రోటి మొద‌లెట్టేశాడు!

శ‌ర్వానంద్ దూకుడుమీదున్నాడు. `96` రీమేక్ సెట్స్‌పై ఉంది. `శ్రీ‌కారం`కూడా రెడీ అవుతోంది. ఈలోగా మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించేశాడు. శ్రీ కార్తీక్ అనే కొత్త కుర్రాడి క‌థ‌కు శ‌ర్వా ఓకే చెప్పాడు. ప్ర‌కాష్‌బాబు, ప్ర‌భు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రం ఈరోజే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. క‌థానాయిక‌గా పెళ్లిచూపులు ఫేమ్ రీతూ వ‌ర్మ‌ని ఎంచుకున్నారు. ప్రేమ‌, స్నేహం నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రానికి సంభాష‌ణ‌లు అందిచ‌డం విశేషం. త్వ‌ర‌లోనే చెన్నైలో చిత్రీక‌ర‌ణ ప్రారంభిస్తారు. వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. 2020 వేస‌వికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. సంక్రాంతికి `శ్రీ‌కారం` విడుద‌ల కానుంది. అంటే.. `శ్రీ‌కారం` విడుద‌లైన మూడు నెల‌ల్లో మ‌రో సినిమా వ‌చ్చేస్తుంద‌న్న‌మాట‌. మ‌రి `96` ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

మరో డీఐజీ రెడ్డి గారికి ఊస్టింగ్ ఆర్డర్స్

పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల...

సందీప్ సినిమాలో ‘మ‌న్మ‌థుడు’ హీరోయిన్‌

'మ‌న్మ‌థుడు'లో క‌థానాయిక గా మెరిసిన అన్షు గుర్తుంది క‌దా? ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యాక అన్షుకి మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. కానీ.. రెండు మూడు సినిమాల త‌ర‌వాత‌.. లండ‌న్ వెళ్లిపోయింది....

గుంటూరు జిల్లా టీడీపీలో చేరికల హుషారు !

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అనేక మంది టీడీపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close