క్రీడా దినోత్సవం రోజు క్లీన్ బౌల్డ్ అయిన ఏపీ క్రీడల శాఖ..!

ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా దినోత్సవాన్ని కొత్త ప్రభుత్వం వైరల్‌గా జరుపుకుంది. మంత్రి అవంతి శ్రీనివాస్.. క్రీడా దినోత్సవం సందర్భంగా… వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకాలు పేరుతో.. ఓ కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించాలని తలపెట్టారు. ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో… ప్రసిద్ధ క్రీడాకారులతో ఫోటోలతో ఫ్లెక్సీలు ముద్రించారు. ఫోటోలు వేసి వదిలేస్తే..సరిపోయేదేమో.. ఎందుకంటే.. వారందరూ నోటెడే..క్రీడలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ..అందరూ తెలుసు. కానీ.. ఏపీ క్రీడా మంత్రిత్వ శాఖ మంత్రి ఆ మాత్రం చాన్స్ ప్రజలకు ఇవ్వకూడదనుకుంది. ఫోటోలతో పాటు పేర్లను కూడా ముద్రించింది. అలాంటి ఓ ఫోటో… హైలెట్ అయింది.

ఫ్లెక్సీ మీద సానియా మీర్జా ఫోటో వేసి..కింద పీ.టీ.ఉష అని.. ముద్రించారు. ఉదయమే ఈ ఫ్లెక్సీని చూసిన.. విశాఖ వాసులు.. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అప్పట్నుంచి… ఇక సోషల్ మీడియాలో క్రీడా దినోత్సవం ప్రారంభమయింది. రకరకాల సెటైర్లు, మీమ్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తించారు. సానియా మీర్జాకు, పీటీ ఉషకు తేడా తెలియని… నేతలు మంత్రులు అయితే.. ఇలాగే ఉంటుందని.. సెటైర్లు ప్రారంభించారు. అన్ని రకాల సోషల్ మీడియాల్లోనూ ఇదే వైరల్ అయిపోయింది.

ఈ వ్యవహారంపై.. క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులు వెంటనే నాలిక్కర్చుకుని అలాంటి ఫ్లెక్సీలన్నింటినీ తీసేశారు కానీ… అప్పటికే జరగాల్సిన నష్టం జరగిపోయింది. కొత్త ప్రభుత్వంలో తొలి క్రీడాదినోత్సవం… క్రీడా మంత్రికి… చుక్కలు చూపించినట్లయింది. క్రీడలపై ఏ మాత్రం అవగాహన లేకుండా… రికమెండేషన్లతో.. మంత్రి వద్ద చేరిన కొంత మంది.. పెత్తనం తీసుకోవడం వల్లే ఈ సమస్య వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి అయినప్పటి నుండి.. అవంతి.. అధికారులను ఎవర్నీ లెక్కచేయడం లేదనే అసంతృప్తి అధికారుల్లో ఉండటంతో.. వారు కూడా…ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేశారంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close