గందరగోళంలో మార్పులేదు..! అమరావతిపై ఇప్పటికింతే..!

రాజధానిలో గత ప్రభుత్వం పిలిచిన రూ. 32వేల కోట్ల నిర్మాణాలకు సంబంధించిన టెండర్లు అన్నీ నిలిపి వేశామని… ఆర్థిక పరిస్థితిని చూసుకుని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటామని.. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో అంతా గందరగోళంగా ఉందన్నారు. ఏపీ రాజధానిపై సీఎం జగన్‌ మూడు గంటలకుపైగా సమీక్షించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన బొత్స… ఎలాంటి కీలక నిర్ణయాలను ప్రకటించలేదు. రాజధాని ప్రాంత రైతులందరికీ కౌలు పంపిణీని ప్రారంభిస్తామన్నారు. రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇంకా పెండింగ్‌ బిల్లులు ఉన్నాయని … భూసమీకరణకు సంబంధించి 43వేల ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ జరిగింద్నారు. మిగతా స్థలాల రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉందన్నారు.

రాజధాని మార్పుపై జరుగుతున్న ప్రచారంపై.. బొత్స… గతంలోలానే స్పందించారు. రాజధాని గురించి ఎవరో… ఏంటో చెబితే తనకేం సంబంధమని ప్రశ్నించారు. ఎవరో చేసిన వ్యాఖ్యలపై తనను వివరణ అడగవద్దన్నారు. రాజధాని ఏ ఒక్కరి కోసమో కాదు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సి ఉందని స్పష్టంచేశారు. రాజదధానిని కొనసాగించే ఉద్దేశంలో వైసీపీ సర్కార్ లేదని… బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ చెప్పిన విషయంపై..బొత్స సూటిగా సమాధానంచెప్పలేకపోయారు. రాజధాని మారుతుందని జీవీఎల్‌ ఎందుకు అన్నారో తెలియదని చెప్పుకొచ్చారు. రాజధాని ముంపు గురించి చర్చించలేదన్నారు.

సీఆర్డీఏపై ముఖ్యమంత్రి నెలవారీ సమీక్షలో భాగంగా సమావేశం ఏర్పాటు చేసినా…ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపధ్యంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. వరదలతో రాజధాని గ్రామాలు మునిగిపోయాయని..ప్రభుత్వం అదే పనిగా ప్రచారం చేయడం.. ఓ వైపు జీవీఎల్ లాంటి వాళ్లు… ప్రకటనలు చేయడంతో..ఇక ఏపీ సర్కార్ అధికారిక ప్రకటన చేయడమే మిగిలిందని అనుకున్నారు. అయితే.. ఎలాంటి నిర్ణయాన్ని ఏపీ సర్కార్ ప్రకటించలేదు. కానీ నిర్మాణాలు కొనసాగిస్తామని కూడా చెప్పలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

అప్పుల క‌న్నా ప‌న్నులే ఎక్కువ‌… ప‌వ‌న్ ఆస్తుల లిస్ట్ ఇదే!

సినిమాల్లో మాస్ ఇమేజ్ ఉండి, కాల్ షీట్ల కోసం ఏండ్ల త‌ర‌బ‌డి వెయిట్ చేసినా దొర‌క‌నంత స్టార్ డ‌మ్ ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్. పిఠాపురం నుండి పోటీ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close