రూ. లక్షల కోట్లు గాయబ్..! మందగమనం కాదు తిరోగమనం..!

భారత ఆర్థిక వ్యవస్థ మందగమనం అంటున్నారు కానీ.. నిజానికి అది తిరోగమనంలోకి చేరింది. విదేశీ మదుపర్లు సహా.. అందరూ భారత్‌పై నమ్మకం కోల్పోతున్నారు. పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. జీడీపీ పడిపోవడమే కాదు.. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా… ప్రతీ రంగం తిరోగమనంలో పడిపోయింది. స్టాక్ మార్కెట్లలో రోజుకు.. లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. రూపాయి విలువ కూడా అంతకంతకూ దిగజారిపోతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 72.27 పైసలకు చేరుకుంది. ఇది ఎక్కడ ఆగుతుందో చెప్పడం కష్టంగా మారింది.

ఉద్దీపన చర్యలు.. సంస్కరణలు అంటూ… బ్యాంకుల విలీనం నిర్ణయం ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరో పోటుగా మారింది. 10 ప్రభుత్వ బ్యాంకుల షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి. కార్పొరేషన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కూడా నష్టాల బాట పట్టాయి. ఆర్థిక మాంద్యం సంకేతాలతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నా.. వెలువడుతున్న గణాంకాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. జీడీపీ దిగజారుతుందని తెలిసిన వెంటనే మైక్రో ఎకనామిక్‌ డేటా విడుదలైంది. అటు డొమెస్టిక్‌ వినియోగం భారీగా తగ్గింది. రూరల్‌ ఏరియాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నిరుద్యోగం పెరగడం, రుణాలు దొరకకపోవడం ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఆటోమోబైల్‌ ఇండస్ట్రీ ఇప్పటికే వెంటిలేటర్‌ మీద ఉంది. కొనుగోళ్లు లేకపోవడంతో ఇప్పటికే కొన్ని ప్లాంట్లు ఉత్పత్తి తగ్గించాయి. దీని ద్వారా ఉద్యోగాలు ఊడుతున్నాయి. అయితే గత ఆగస్ట్‌లో ఆటోమోబైల్‌ అమ్మకాలు రెండంకెలకు పైగా పడిపోయాయని ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి. ఇది కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఆటో ఇండస్ట్రీ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శనగా చెబుతున్నారు. ఇక ఉత్పత్తి రంగం 15 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆగస్ట్‌లో అన్ని రంగాలు నేలచూపులు చూడటంతో.. ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఏం చేసినా.. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చేతులు కాలిపోయాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close