కోమ‌టిరెడ్డి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయం మ‌రోసారి వేడెక్కుతోంది. హుజూర్ న‌గ‌ర్ అభ్య‌ర్థి ఎంపిక‌పై ఇప్ప‌టికే ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి పేరును ప్ర‌క‌టించేశారు. దాన్ని ఎంపీ రేవంత్ రెడ్డి వ్య‌తిరేకిస్తూ మ‌రో అభ్య‌ర్థి పేరును ప్ర‌తిపాదించిన సంగ‌తి కూడా తెలిసిందే. అయితే, ప‌రోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. అసెంబ్లీ లాబీలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ… హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌ర్ని నిల‌బెట్టాలో త‌మ‌కు బాగా తెలుసనీ, ఎవ్వ‌రూ స‌ల‌హాలు ఇవ్వ‌క్క‌ర్లేద‌న్నారు. ఈ మ‌ధ్య‌నే పార్టీలోకి వ‌చ్చి చేరినవారు ఇచ్చే స‌ల‌హాలూ సూచ‌న‌లూ త‌మ‌కు అవ‌స‌రం లేదంటూ… ప‌రోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కోమ‌టిరెడ్డి మాట్లాడారు.

రేవంత్ రెడ్డి ప్ర‌తిపాదించిన ఆ అభ్య‌ర్థి ఎవ‌రో త‌న‌కు తెలీద‌నీ, ఆయ‌న పేరును కూడా వినలేద‌న్నారు! హుజూర్ న‌గ‌ర్లో పద్మావ‌తి స‌రైన అభ్య‌ర్థ‌నీ, పార్టీలో నాయ‌కులూ కార్య‌క‌ర్త‌ల అభిప్రాయాలు తీసుకునే నిర్ణ‌యించామ‌న్నారు. త‌మ జిల్లాకు చెందిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లాంటి సీనియ‌ర్ నేత‌లున్నార‌నీ, పొరుగు జిల్లాల‌కు చెందిన నాయ‌కులు చేసిన వ్యాఖ్యాల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇదే స‌మ‌యంలో కొత్త పీసీసీ అధ్య‌క్షుడి నియామ‌కానికి సంబంధించి కూడా ఆయ‌న మాట్లాడారు! ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని మార్చితే… త‌న‌కే ఎక్కువగా అవ‌కాశాలున్నాయ‌నీ, పార్టీలో సీనియ‌ర్ల స‌పోర్ట్ త‌న‌కు ఉంద‌న్నారు.

కోమ‌టిరెడ్డి మ‌నోగ‌తం అద‌న్న‌మాట‌! పీసీసీ పీఠంపై ఆయ‌న ఎప్ప‌ట్నుంచో క‌న్నేశారు. విచిత్రం ఏంటంటే… ఉత్త‌మ్ కుమార్ నాయ‌క‌త్వం బాగోలేద‌ని గ‌తంలో విమ‌ర్శించిన కోమ‌టిరెడ్డి… ఇప్పుడు రేవంత్ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి ఉత్త‌మ్ తో ఎలాంటి విభేదాలు లేవ‌న్న‌ట్టు మాట్లాడుతున్నారు. న‌ల్గొండ జిల్లా రాజ‌కీయాల్లో ఉత్త‌మ్, జానా, కోమ‌టిరెడ్డిలు ఎవ‌రిదారి వారిది అన్న‌ట్టుగా ఉంటారు. హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రి… ఇంకా చెప్పాలంటే ఈ అంశంలో రేవంత్ రెడ్డి జోక్యం చేసుకునేస‌రికి.. ఈ ముగ్గురూ ఏకాభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టుగా కోమ‌టిరెడ్డి మాట్లాడుతున్నారు. పీసీసీ ప‌గ్గాలు రేవంత్ కి ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌నే చ‌ర్చ కొన్నాళ్లుగా జ‌రుగుతున్న‌దే. ఈ మ‌ధ్య‌నే పార్టీలోకి వ‌చ్చిన ఆయ‌న‌కి ఇవ్వ‌డ‌మేంట‌నే అసంతృప్తితో హైక‌మాండ్ వ‌ర‌కూ కొంత‌మంది నేత‌లు వెళ్లి ఫిర్యాదులు చేసిన సంగ‌తీ తెలిసిందే. ఆ పీసీసీ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉప ఎన్నిక నేప‌థ్యంలో రేవంత్ మీద‌ అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టున్నారు కోమ‌టిరెడ్డి. పార్టీలో ఈ మ‌ధ్య‌నే చేరారు అనే పాయింట్ ని మాత్ర‌మే హైలైట్ చేస్తూ వ‌స్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close