విశాఖలో సెటిల్మెంట్ ముఠాలు..! రాజకీయమే తెచ్చిందా..?

విశాఖలో పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్‌లో చెలరేగిపోయిన సెటిల్మెంట్ ముఠాలు ఇప్పుడు.. మళ్లీ విశాఖలో.. హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో విశాఖ ముఠాలు.. సెటిల్మెంట్ల కోసం ఏకంగా నలుగురు ప్రముఖుల్ని బెదిరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఓ పారిశ్రామికవేత్త.. తన ఇంట్లోకి వచ్చిన ముఠాకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలను మంత్రి ముత్తంశెట్టికి అందజేశారు. అయితే.. పోలీసులకు వరకూ ఈ వ్యవహారం వెళ్లనీయలేదని… విశాఖలో ప్రచారం జరుగుతోంది. నరేష్ కుమార్ అనే ఆ పారిశ్రామికవేత్త ఇప్పుడు ప్రాణభయంతో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసే ఉద్దేశంలో ఉన్నారని చెబుతున్నారు.

వివాదాల్లో ఉన్న భూముల గుర్తించి సెటిల్మెంట్ చేయడంలో.. గతంలో కొన్ని ముఠాలు చురుగ్గా పని చేసేవి. అయితే.. ప్రభుత్వాలు మారినప్పుడు అవి అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోతూంటాయి. అనుకూలమైన ప్రభుత్వం వచ్చినప్పుడు.. మళ్లీ విజృంభిస్తూ ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా.. విశాఖలో మాత్రం.. ఇలాంటి బెదిరింపు ముఠాలు పెద్దగా కనిపించేవి కాదు. కానీ ఈ సారి మాత్రం పరిస్థితి మారిపోయింది. పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖుల్ని టార్గెట్ చేయడం… వివాదాలైమైనా ఉంటే.. సెటిల్ చేసుకోండి.. లేకపోతే ప్రాణాలు, ఆస్తి దక్కవని సదరు ముఠాలు హెచ్చరిస్తూండటంతో.. వ్యాపార ప్రముఖులు వణికిపోతున్నారు. ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా.. వారు జంకుతున్నారు. రాజకీయ అండదండలతో వారు విశాఖలో చెలరేగిపోతున్నారని.. ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వారి సాయంతోనే వేధిస్తారన్న భయాలు విశాఖలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసుల తీరుపై… అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లా సమీక్షా సమావేశంలో.. ఈ అంశాన్ని మంత్రి అవంతి విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. అన్నీ మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ఈ సెటిల్మెంట్ ముఠాలపై మాత్రం… ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదన్న ప్రచారం… వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఇలాంటివి ఏమైనా ఉంటే.. అణచి వేయాలని ఎవరైనా చెబుతారు కానీ.. ప్రభుత్వ వ్యవస్థల్ని.. పోలీసుల్ని కూడా గుప్పిట్లో పెట్టుకున్నారని ప్రచారం జరుగుతున్న విజయసాయిరెడ్డి.. ఈ విషయంలో మౌనంగా ఉండటంతో.. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. ప్రశాంతమైన విశాఖ నగరంలో.. పరిస్థితులు కట్టు తప్పేలా మారిపోతున్నాయన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close