మాట్లాడండి జ‌గ‌న్ గారూ… ట్విట్ట‌ర్లో నారా లోకేష్..!

గ్రామ స‌చివాల‌య ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంపై మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్ప‌టికైనా నోరు తెరిచి మాట్లాడండి జ‌గ‌న్ గారూ అంటూ సంబోధిస్తూ వ‌రుస ట్వీట్లు చేశారు. క‌ళ్లెదురుగా నిజాలు క‌నిపిస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటారంటూ… కార్య‌క‌ర్త‌ల‌కే ఉద్యోగాలు అని విజ‌య‌సాయి రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల వీడియో పోస్ట్ చేశారు. మా పార్టీ కార్య‌క‌ర్త‌లూ అభిమానుల క‌ళ్ల‌లో ఆనందం కోస‌మే పేప‌ర్ లీక్ చేశామ‌ని చెప్పండి జ‌గ‌న్ గారూ అంటూ ఎద్దేవా చేశారు.

రూ. 5 ల‌క్ష‌ల‌కు ప్ర‌శ్న ప‌త్రాన్ని అమ్ము‌కున్నార‌‌ని మీ మంత్రి పెద్దిరెడ్డి చెప్పార‌నీ, గ్రామ స‌చివాల‌యాల ఉద్యోగాల్లో 90 శాతం అర్హ‌త పొందిన‌వాళ్లు మ‌న‌వాళ్లే ఉన్నార‌ని ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టంగా చెప్పార‌ని లోకేష్ అన్నారు. ఇప్ప‌టికైనా నోరు తెర‌వండి జ‌గ‌న్ గారూ అంటూ ఆ ట్వీట్ చివ‌ర్లో రాశారు! మ‌రో ట్వీట్లో… మీ పాల‌న రాష్ట్రానికి శాప‌మ‌నీ, యువ‌త‌కు మీ పాల‌న‌లో జ‌రుగుతున్న అన్యాయం క్ష‌మించ‌రానిదనీ, వంద రోజుల్లోనే మీ ప‌నిత‌నం ఏంటో ప్ర‌జ‌ల‌కు పూర్తిగా అర్థ‌మైపోయింద‌నీ, అందుకే ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు కూడా ఎమ్మెల్యేలు సిగ్గుప‌డుతున్నార‌నీ, ఇప్ప‌టికైనా మాట్లాడండి జ‌గ‌న్ గారూ అంటూ స్పందించారు. గతంలో, జ‌ర‌గ‌ని పేప‌ర్ లీకేజీ మీద నానా ర‌భ‌స చేశార‌ని గుర్తు చేస్తూ… విచార‌ణ జ‌రిగి ఏం లేద‌ని తేలినా అప్ప‌ట్లో ఆగ‌లేద‌న్నారు. రాజీనామా చెయ్యాలీ, సీబీఐతో విచార‌ణ చెయ్యాలంటూ అప్ప‌ట్లో చాలా విమ‌ర్శ‌లు చేశార‌నీ, ఇప్పుడేం చేద్దామో చెప్పాల‌ని ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి ప్ర‌శ్నించారు. దీనికి సంబంధించి అప్ప‌ట్లో సాక్షి ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నాలను కూడా నారా లోకేష్ పోస్ట్ చేశారు.

గ్రామ స‌చివాల‌య ప‌రీక్ష‌ల పేప‌ర్ల లీకేజీపై వ‌రుస‌గా పోస్టులు పెడుతూ… ఇప్ప‌టికైనా మాట్లాడండి జ‌గ‌న్ గారూ అంటూ వ‌రుస ట్వీట్లు చేస్తున్నారు. గ‌తంలో మంత్రి నారాయ‌ణ‌ను రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసిన‌ వైకాపా తీరును కూడా గుర్తుచేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పేప‌ర్ల లీకేజీ వ్య‌వ‌హారంపై చాలా సందేహాలు ప్ర‌జ‌ల్లో కూడా ఉన్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగా విజ‌య‌సాయి రెడ్డి ప్ర‌సంగ‌మూ ఉంది, అది ఇప్పుడు బాగా వైర‌ల్ అయింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలా ఈ వ్య‌వ‌హారాన్ని డీల్ చేస్తుందో చూడాలి. మొత్తానికి, టీడీపీకి ఇదో పోరాస్త్రంగా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close