పవన్ కళ్యాణ్ స్పీచ్ మధ్యలో బ్రేక్ ఇచ్చిన సాక్షి

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ హక్కులు సాక్షి దక్కించుకుంది. అయితే సాధారణంగా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఏదైనా ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వస్తే, బ్రేక్స్ పక్కనపెట్టి మరీ పవన్ కళ్యాణ్ స్పీచ్ నిరంతరాయంగా అందిస్తూ ఉంటాయి టీవీ చానల్స్. కానీ సరిగ్గా పవన్ కళ్యాణ్ స్పీచ్ సమయంలో సాక్షి బ్రేక్ ఇవ్వడం ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వివరాల్లోకి వెళితే..

సాక్షి ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో అన్న సందేహం ముందు నుండి ఉంది. గత రెండేళ్లుగా పవన్ కళ్యాణ్ వార్తల విషయంలో సాక్షి వ్యవహరిస్తున్న తీరు దీనికి కారణం. గతంలో అరవింద సమేత సినిమా లాంచ్ కి పవన్ కళ్యాణ్ హాజరైనప్పుడు సాక్షి సినిమా పేజీ లో సైతం పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా సాక్షి వార్త ని ఇచ్చిన తీరు అప్పట్లో పాఠకులని ఆశ్చర్య పరిచింది. తెలకపల్లి రవి పుస్తకాన్ని ఇటీవల పవన్ కళ్యాణ్ లాంచ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో ని డిలీట్ చేసి మరి ఆ వార్తలు సాక్షి ఇచ్చిన తీరు ని కూడా చాలామంది ఖండించారు. ఇక ఇవాళ పవన్ కళ్యాణ్ విషయంలో సాక్షి ఎలా వ్యవహరిస్తుందో అని సందేహిస్తూ ఈవెంట్ చూసిన ప్రేక్షకుల అనుమానాలను కొంతవరకు నిజం చేసింది సాక్షి.

తెలంగాణలో ఇంటర్ మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు ప్రస్తావించిన పవన్:

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తాను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటే, అప్పట్లో చిరంజీవి ఇచ్చిన కౌన్సిలింగ్ వల్లే తాను ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని చెబుతూ, ఇటీవల తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినందుకు ఆత్మ హత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలలో ఈ విధంగా గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు ఉండి ఉంటే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండేవారు కారేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలు తనను బాధించాయని వ్యాఖ్యానించారు.

సైరా నరసింహారెడ్డి కి గళం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను అన్న పవన్:

అదే విధంగా, తాను ఈ సినిమా కోసం తన వాయిస్ ఇచ్చిన విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించాడు. ఎప్పుడో శుభలేఖ అనే సినిమా సమయంలో ఈ విధంగా చిరంజీవి సినిమాకు తన గొంతు ఇచ్చానని, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆ విధంగా గొంతు ఇచ్చానని చెప్పారు. దేశభక్తి గురించి వచ్చే ఆ డైలాగ్స్ చెప్పమని అడిగినప్పుడు తాను ఎంతో ఇష్టంగా ఆ డైలాగ్స్ చెప్పానని, తన మనసుకు దగ్గరగా ఆ డైలాగ్స్ ఉన్నందువల్లే ఎంతో ఇష్టంగా ఆ డైలాగ్స్ చెప్పానని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

స్పీచ్ మధ్యలో కట్ చేసిన సాక్షి:

అయితే పవన్ కళ్యాణ్ ఉపన్యాసం ఈ విధంగా కొనసాగుతూ ఉండగా, సాక్షి పవన్ కళ్యాణ్ స్పీచ్ కు బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ తర్వాత పవన్ కళ్యాణ్ స్పీచ్ కొనసాగించకుండా, ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి స్పీచ్ తో మొదలెట్టింది. అయితే సాక్షి కట్ చేసిన ఆ కాసేపట్లో, ఒక అభిమాని స్టేజీ మీదకు దూసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకున్నాడు. దీంతో అలెర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆ అభిమాని ని లాగి వేయడానికి ప్రయత్నిస్తే పవన్ కళ్యాణ్ వారిని గద్దించి అభిమాని ని గట్టిగా హత్తుకుని పంపించివేశారు.

పేరుకి లైవ్ అయినప్పటికీ , స్టేజి మీద జరుగుతున్న దానికి, టీవీ లో టెలికాస్ట్ అవుతున్న దానికి మధ్యలో ఒక ఐదు నిమిషాల లోపు ల్యాగ్ ఉంటుంది కాబట్టి, సాక్షి ఉద్దేశ పూర్వకంగానే ఆ ఇన్సిడెంట్ కట్ చేసి ఉండవచ్చని చూసిన ప్రేక్షకులు భావించారు. పైగా ముఖ్యమైన వ్యక్తుల అందరి ఉపన్యాసాలు, బ్రేక్ ఇవ్వకుండా ఇచ్చిన సాక్షి, పవన్ కళ్యాణ్ విషయంలో బ్రేక్ ఇవ్వడానికి కారణం ఇదే అని చూసిన ప్రేక్షకులు అనుమాన పడితే, అది వారి తప్పేమీ కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close