శంక‌రాభ‌ర‌ణం.. బాహుబ‌లి.. సైరా

తెలుగు సినిమాకి ఖ్యాతి తీసుకొచ్చిన సినిమాలు చెప్ప‌మంటే శంక‌రాభ‌ర‌ణం త‌ప్ప‌కుండా గుర్తొస్తుంది. ఆ జాబితాలో బాహుబ‌లి కూడా చేరుతుంది. అదే స్థాయిలో `సైరా` కూడా ఉండ‌బోతోంద‌ని చిరంజీవి విశ్వాసంగా చెబుతున్నారు. ఆయ‌న న‌టించిన 151వ చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. అక్టోబ‌రు 2న విడుద‌ల కాబోతోంది. ఈరోజు రాత్రి హైద‌రాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

భ‌గ‌త్ సింగ్ లాంటి స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి పాత్ర‌లో న‌టించాల‌ని ఎప్ప‌టి నుంచో ఉండేద‌ని, కానీ త‌న ద‌గ్గ‌ర‌కు ఎవరూ అలాంటి క‌థ‌లు తీసుకురాలేద‌ని గుర్తు చేసుకున్నారు చిరు. పుష్క‌ర‌కాలం క్రితం ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ త‌న ద‌గ్గ‌రకు ఈ క‌థ తీసుకొచ్చార‌ని, అప్ప‌ట్లో ఈ సినిమాకి 60 – 70 కోట్ల బ‌డ్జెట్ అయ్యుండేద‌ని, కానీ త‌న మార్కెట్ అంత‌గా లేక‌పోవ‌డం వ‌ల్ల ఆ ప్రాజెక్టు ముందుకు క‌ద‌ల్లేద‌న్నారు. బాహుబ‌లికి వ‌చ్చిన వ‌సూళ్లు చూశాకే సైరా తీయ‌గ‌లం అన్నధైర్యం క‌లిగింద‌ని, ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకున్నారు చిరంజీవి. ”చాలా సినిమాలువిజ‌య‌వంతం అవుతాయి. అందులో కొన్ని మాత్ర‌మే గ‌ర్వ‌కార‌ణంగా నిల‌బ‌డ‌తాయి. నేను ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన తొలినాళ్ల‌లో `శంక‌రాభ‌ర‌ణం` అలాంటి గౌర‌వాన్ని క‌లిగించింది. ఎక్క‌డ‌కువ ఎళ్లినా ఆ సినిమా గురించి గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. ఆ త‌ర‌వాత చాలా మంచి సినిమాలొచ్చాయి. కానీ బాహుబ‌లి తో తెలుగువాళ్లు గ‌ర్వంగా కాల‌ర్ ఎత్తుకుని నిల‌బ‌డ్డారు. అలాంటి గౌర‌వం సైరా తీసుకొస్తుంద‌ని నా న‌మ్మ‌కం” అన్నారు చిరంజీవి. అయితే తాను రికార్డుల గురించి మాట్లాడ‌డం లేద‌ని, కేవ‌లం గౌర‌వం గురించే చెబుతున్నాన‌ని చిరు ఈ సంద‌ర్భంగా నొక్కి వ‌క్కానించ‌డం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close