అందుకే డైరెక్ష‌న్ చేయ‌లేదు: చిరంజీవి

ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌ని సినిమాగా తీయాల‌న్న‌ది ఇప్ప‌టి ఆలోచ‌న కాదు. దాదాపు ఈ క‌థ ప‌దిహేనేళ్ల నుంచీ న‌లుగుతూనే ఉంది. ద‌ర్శ‌కులుగా కొంత‌మంది పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఓ ద‌శ‌లో వినాయ‌క్ ఈ సినిమా చేస్తాడ‌ని చెప్పుకున్నారు. చివ‌రికి సురేంద‌ర్ రెడ్డికి ఈ అవ‌కాశం ద‌క్కింది. నిజానికి.. ఈ సినిమాకి డైర‌క్ష‌న్ చేయాల‌న్న ఆలో్చ‌న చిరుకి కూడాఉండేద‌ట‌. ఈ సినిమాకి మీరే ద‌ర్శ‌క‌త్వం వ‌హించండి అంటూ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ లాంటి వాళ్లు స‌ల‌హా ఇచ్చార్ట‌. కానీ చిరంజీవి మాత్రం ఒప్పుకోలేదు. ఈ విష‌యాన్ని `సైరా` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు చిరంజీవి.

”న‌ట‌న ద‌ర్శ‌క‌త్వం రెండు ప‌నులూ ఒకేసారి చేయ‌డం సాధ్యం కాదు. అయితే డైర‌క్ష‌న్‌, లేదంటే న‌ట‌న‌. రెండింటిలో ఏదో ఒక‌టి ఎంచుకుంటాను అని చెబితే.. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కంగారు ప‌డ్డారు. ‘మీరు న‌టించండి.. డైర‌క్ష‌న్ వ‌ద్దు’ అన్నారు. ధృవ త‌ర‌వాత సురేంద‌ర్‌రెడ్డి ప‌నిత‌నం తెలిసింది. ఈ సినిమాకి త‌నైతే న్యాయం చేస్తాడ‌ని చ‌ర‌ణ్ చెప్పాడు. సురేంద‌ర్‌రెడ్డిని పిలిచి సినిమా చేతుల్లో పెడితే ఎగిరి గంతేస్తాడ‌నుకున్నాం. కానీ రెండు నెల‌లు స‌మ‌యం కావాలి అని మ‌మ్మ‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. రెండు నెల‌ల త‌ర‌వాత తిరిగొచ్చి `నేను చేస్తా`అని చెప్ప‌డం సంతోషం క‌లిగించింది. చ‌రిత్ర‌ని ఎక్క‌డా వ‌క్రీక‌రించ‌కుండా చ‌క్క‌టి వాణిజ్య విలువ‌ల‌తో ఈ సినిమాని తెర‌కెక్కించాడ‌”న్నారు చిరంజీవి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close