మ‌గ‌ధీర‌లో హీరోగా చిరంజీవి త‌న‌ని తాను ఊహించుకున్నారు: రాజ‌మౌళి

వీఎఫ్ఎక్స్ మాయాజాలం మ‌గ‌ధీర‌తో ఆరంభ‌మైంది. ఆ సినిమాతో చ‌ర‌ణ్ కెరీర్‌కి బాట‌లు వేశాడు రాజ‌మౌళి. అయితే ఈ సినిమా జ‌రుగుతున్న‌ప్పుడు స్టోరీ డిస్క‌ర్ష‌న్స్‌లో చిరంజీవి ప్ర‌మేయం ఎక్కువ‌గా ఉండేద‌ట‌. ఆయ‌న కొన్ని స‌ల‌హాలూ ఇచ్చార‌ని రాజ‌మౌళి చెప్పుకొచ్చారు. `సైరా` ప్రీ రీలీజ్ వేడుక‌లో ఆ అనుభ‌వాల్ని వేదిక‌పైనుంచి పంచుకున్నారు.

”మ‌గ‌ధీర డిస్క‌ర్ష‌న్స్‌లో చిరంజీవి పాల్గొనేవారు. మాకు కొన్ని స‌ల‌హాలూ ఇచ్చారు. కొన్ని స‌న్నివేశాల్లో న‌టించి మ‌రీ చూపించేవారు. రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌లో త‌న‌ని తాను ఊహించుకుంటున్నార‌ని ఆ త‌ర‌వాత నాకు అర్థ‌మైంది. మ‌గ‌ధీర విడుద‌ల‌య్యాక‌.. ‘ఇలాంటి సినిమా నేనెందుకు చేయ‌లేదు’ అని నాతో చెప్పారు. ఆ కోరిక‌ను ఈ రోజు చ‌ర‌ణ్ తీర్చాడు. చ‌ర‌ణ్ త‌న తండ్రికి ఇస్తున్న కానుక మాత్ర‌మే కాదు, తెలుగు చిత్ర‌సీమ‌కు అందిస్తున్న కానుక సైరా. ఇలాంటి సినిమా తీయ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డాలో నాకు తెలుసు. వీఎఫ్ఎక్స్ షాట్స్ తీయ‌డం క‌ష్టం కాదు, వాటి మ‌ధ్య ఎమోష‌న్ మిస్ అవ్వ‌కుండా తీయ‌డం చాలా క‌ష్టం. సురేంద‌ర్‌రెడ్డికి ఆ క్రెడిట్ ద‌క్కుతుంది” అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close