సైరా.. చ‌ర‌ణ్ చేస్తే ఎలా ఉండేదో..?

సైరా క‌థ‌ దాదాపు 12 ఏళ్లు న‌లిగింది. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ చిరంజీవి కోసం ఇష్టంగా త‌యారు చేసుకున్న క‌థ ఇది. ఈ క‌థ చెప్పిన‌ప్పుడే చిరు ఆస‌క్తి క‌నబ‌రిచారు. కాక‌పోతే ఈ సినిమాకి కావ‌ల్సిన బ‌డ్జెట్‌, అప్ప‌టి చిరు మార్కెట్‌కి చాలా దూరంగా ఉంది. ఓ ద‌శ‌లో ఈ స్క్రిప్టుపై దాదాపు యేడాది పాటు ప‌నిచేశారు. ప‌ట్టాలెక్కుతుంది అన‌గా… చిరు రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయారు. అలా.. ఈ సినిమాకి మ‌ళ్లీ బ్రేకులు ప‌డ్డాయి. చిరు ఇక సినిమాలు చేయ‌రు, రాజ‌కీయాల్లోనే ఉండిపోవాల్సివ‌స్తుంద‌ని అనుకున్నప్పుడు ఈ ప్రాజెక్టుపై నీలి నీడ‌లు క‌మ్ముకున్నారు. మ‌రో హీరోతో చేస్తే ఎలా ఉండేదో అనే ఆలోచ‌న‌లూ వ‌చ్చాయి. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని ప‌క్క‌న పెడుతూ చిరంజీవి కోస‌మే ఎదురుచూశారు ప‌రుచూరి సోద‌రులు.

ఓ ద‌శ‌లో `ఈ క‌థ చర‌ణ్‌తో చేయొచ్చు క‌దా` అని చిరు స‌ల‌హా కూడా ఇచ్చారు. కానీ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ మాత్రం `ఈ సినిమా చేస్తే మీరే చేయాలి.. లేదంటే లేదు` అని ప‌ట్టుబ‌ట్టారు. అది ఇన్నాళ్ల‌కు కార్య‌రూపం దాల్చింది. ఈ సినిమాకి అతి పెద్ద ప్ల‌స్ పాయింట్ చిరంజీవినే. ఏ హీరో చేసినా… ఇంత గ్రేస్ వ‌చ్చేది కాదు. దేశానికి సంబంధించి, దేశ భ‌క్తికి సంబంధించి ఎన్నో సంభాష‌ణ‌లు ఈ సినిమాలో ఉన్నాయి. అవ‌న్నీ ఓ స్టేచ‌ర్ ఉన్న న‌టుడి చెబితేనే జ‌నాల్లోకి వెళ్తాయి. చ‌ర‌ణ్ చేసుంటే.. ఈ సినిమాకి స‌రికొత్త క‌లరింగు, ఇంకాస్త ఈజ్ వ‌చ్చి ఉండేవి. కాక‌పోతే.. ఇంత గౌర‌వం ద‌క్కేది మాత్రం కాదు. పైగా చిరంజీవికి ఎప్ప‌టి నుంచో భ‌గ‌త్ సింగ్ లాంటి దేశ‌భ‌క్తుడి క‌థ సినిమాగా తీయాల‌న్న‌ది కోరిక‌. ప‌న్నెండేళ్ల క్రితం ఈ క‌థ చిరంజీవికి వినిపించ‌నప్పుడు ఆయ‌న ఉద్వేగానికి లోనైంది కూడా ఆ పాయింట్ ద‌గ్గ‌రే. అందుకే చిరు కోసం ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఇన్నాళ్లు ఆగారు. దానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్కింది. చిరు ఈ సినిమా చేశాడంటే దానికి మూల కార‌ణం ప‌రుచూరి సోద‌రులే. చిరు రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయిన‌ప్పుడు.. తొంద‌ర‌ప‌డి ఈ సినిమాని మ‌రో హీరో చేతుల్లో పెట్ట‌లేదు. చ‌ర‌ణ్ చేస్తాన‌న్నా ఒప్పుకోలేదు. చిరు కోసం ఇన్నాళ్లు ఎదురు చూశారు. అందుకే సైరా క్రెడిట్‌లో వాళ్ల‌కూ వాటా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close