జగన్ పాలసీ కేసీఆర్‌నకు నచ్చలే..!

మద్యం విధానం విషయంలో అత్యధిక ఆదాయం పొందేందుకు ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన విధానం.. ఆప్తమిత్రుడైన తెలంగాణ సీఎం కేసీఆర్ కు నచ్చలేదు. జగన్ ఆలోచన చేసినట్లుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే… మద్యం షాపులు పెట్టే ఆలోచన చేస్తున్నారని మీడియాలో ప్రచారం జరిగినా.. చివరికి తెలంగాణ ప్రభుత్వం మాత్రం మద్యం పాలసీని లైసెన్స్ ఫీజులు పెంచి … సరిపెట్టింది. తెలంగాణలో నవంబర్‌ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలు చేయబోతున్నారు. గతంలో ఉన్న 4 శ్లాబులను 6గా మార్చారు. 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా ప్రాంతాల్లో రూ.60 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షలలోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు లైసెన్స్‌ ఫీజు వసూలు చేయబోతున్నారు.

మద్యం దుకాణాల కోసం నాన్‌ రిఫండబుల్‌ దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలుగా నిర్ణయించారు. తెలంగాణలో మొత్తం 2,216 దుకాణాలకు లాటరీ పద్ధతిన దుకాణదారుల ఎంపిక జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉ.10 నుంచి రాత్రి 11 గంటల వరకు… ఇతర ప్రాంతాల్లో ఉ.10 నుంచి రాత్రి 10 వరకు అమ్మకాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఏపీలో… మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తూండటంతో.. అక్కడ మద్యం వ్యాపారులంతా.. తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో… పోటీ కూడా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు.

అందుకే.. నాన్ రిఫండబుల్ దరఖాస్తుల కిందే… రూ. కోట్లు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ సర్కార్ కు … ఇప్పుడు.. ఇవన్నీ వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం సొంతంగా నిర్వహించే టెన్షన్ కన్నా.. లైసెన్స్ ఫీజులు పెంచి.. మద్యం ధరలను ఎంతో కొంత పెంచితే టెన్షన్ లేకుండా సర్కార్ కు ఆదాయం వస్తుందని.. తెలంగాణ పెద్దలు భావించినట్లుగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close