బిగ్ బీకి పారితోషికం ఇచ్చారా?

సైరాలో బిగ్ బీ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి గురువుగా అమితాబ్ క‌నిపించారు. బిగ్ బీ లాంటి న‌టుడ్ని తెలుగు ప‌రిశ్ర‌మ‌కు తీసుకురావ‌డం నిజంగా ఓ అద్భుత‌మే. ఇది వ‌ర‌కు చాలామంది బిగ్ బీతో ఓ పాత్ర చేయించాల‌ని ప్ర‌య‌త్నించారు. అంతెందుకు… బాల‌య్య – కృష్ణ‌వంశీల `రైతు`లో ఓకీల‌క పాత్ర కోసం అమితాబ్ బ‌చ్చ‌న్ ని సంప్ర‌దిస్తే… బిగ్ బీ సున్నితంగా తిర‌స్క‌రించారు. అలాంటిది.. సైరాలో బిగ్ బీ న‌టించ‌డం ఓ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అయ్యింది.

సాధార‌ణంగా చిన్న పాత్ర అయినా స‌రే, అమితాబ్ బ‌చ్చ‌న్ పారితోషికం కోట్ల రూపాయ‌ల్లో ఉంటుంది. కానీ ‘ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ సినిమాలో న‌టించారు’ అని చిరంజీవి ప‌దే ప‌దే చెబుతున్నారు. నిజానికి అమితాబ్ `నాకు పారితోషికం వ‌ద్దు` అనే చెప్పారు. కానీ చిరు మాత్రం అమితాబ్ బి భారీ మొత్తంలో పారితోషికాన్ని బ‌ల‌వంతంగా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఆ పారితోషికం రూ.5 కోట్లకు పైమాటే అని టాక్‌. అయితే అది పారితోషికంలా కాకుండా.. ఓ గిఫ్ట్‌లా ఇచ్చిన‌ట్టు ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. అనుష్క కూడా ఓ చిన్న పాత్ర‌లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు కూడా ఖరీదైన బ‌హుమ‌తి ఇవ్వాల‌ని చ‌ర‌ణ్ నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. చిరంజీవి క‌ల‌ల చిత్రంలో న‌టించ‌డానికి ముందుకొచ్చిన ఈ ఇద్ద‌రికీ… చ‌ర‌ణ్ త‌గిన రీతిలోనే స‌త్క‌రించాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close