చైతన్య: ఏపీ నుంచి పరిశ్రమల రివర్స్ పరుగులు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అంతా రివర్స్ పాలన సాగుతోంది. రివర్స్ టెండర్లు మాత్రమే కాదు.. పరిశ్రమలు కూడా రివర్స్ అవుతున్నాయి. ఐదు నెలల కిందటి వరకూ.. వచ్చిపోయే పారిశ్రామికవేత్తలతో ఏపీ కళకళలాడేది. ప్రతీ నెలా ఏదో ఓ శంకుస్థాపన జరిగేది. కానీ ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్నవి కూడా రివర్స్ అవుతున్నాయి.

ఐదు నెలల నుంచి ఏపీలో పెట్టుబడులన్నీ రివర్స్..!

ఆదాని గ్రూప్ విశాఖలో రూ. 70వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ పెట్టాలనుకుంది. కానీ.. దాని గురించి చెప్పకుండా సైలెంట్ గా హైదరాబాద్ కు వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ అనే కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిది. ఆయితే.. కొద్ది రోజుల క్రితం.. ఆ ఎంవోయూ విషయంలో.. ఆసక్తిగా లేదని..పేపర్ పరిశ్రమలో ప్రచారం జరిగింది. ఏపీపీ కూడా.. మళ్లీ ఏపీ వైపు చూడలేదు. దీంతో ఆ పరిశ్రమ కూడా వెనక్కి పోయినట్లేనన్న అభిప్రాయం… ఏర్పడింది. కొన్ని పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతే.. మరికొన్నింటినీ ఏపీ ప్రభుత్వం పంపేసింది. విశాఖలో అంతర్జాతీయ స్థాయి మాల్ నిర్మాణానికి ముందుకు వచ్చిన లులూ గ్రూప్‌కు కేటాయిచిన భూమిని ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే అమరావతిలో భారీ వైద్య సంస్థలను నిర్మించాలనుకు ప్రసిద్ధ కంపెనీల భూముల కేటాయింపులను రద్దు చేశారు. విజయవాడ సమీపంలో నిర్మితమైన అశోక్ లేలాండ్ కంపెనీ.. ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ శరవేగంగా ఫ్యాక్టరీని నిర్మించింది. కానీ ఉత్పత్తి మాత్రం ప్రారంభించలేదు.

ప్రభుత్వ విధానాలతో మరింత దూరం..!

ఇక ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు గతంలోఎంవోయూ కుదుర్చుకున్న సంస్థలు.. ముందూ వెనుకాడుతున్నాయి. గత ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నందున ఆయా సంస్థలతో డీల్ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధపడటం లేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో.. గత ఐదు నెలల కాలంలో.. ఏపీకి ఒక్కటంటే.. ఒక్క పరిశ్రమ రాలేదు. కానీ.. వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలున్న కంపెనీలు మాత్రం రివర్స్ అయ్యాయి.. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఏపీలో ఎవరు ఏ పరిశ్రమ పెట్టినా.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెచ్చారు. అలాగే.. గతంలో భూములు పొందిన పారిశ్రామికవేత్తలకు వరుసగా నోటీసులు వెళ్లాయి. కొన్ని కంపెనీలపై కక్షగట్టినట్లుగా వ్యవహరించడం… విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో… ఒప్పందాలను కూడా పట్టించుకోబోమన్నట్లుగా ఉండటంతో.. ఏపీపై పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారన్నట్లుగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రభుత్వ కార్యాచరణ ఇలాగేనా..?

ఏపీకి పరిశ్రమలు అవసరం లేదన్నట్లుగా ప్రభుత్వం తీరు ఉంది. ప్రోత్సహాకాలు ఇవ్వడం దండగని… సాక్షాత్తూ మంత్రే ప్రకటించేస్తున్నారు. ఆయన ఏపీని ఇట్టే పారిశ్రామికీకరణ చేస్తామని చెబుతున్నారు. ఐదు నెలల్లో.. రెండు విదేశీ బృందాలు.. పెట్టుబడులు పెడతామమంటూ ముందుకు వచ్చాయి.అందులో ఒకటి.. ఫ్రాన్స్ కు చెందిన వికాట్ గ్రూప్. అది సీఎం జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతీ సిమెంట్స్ భాగస్వామి. మరింత విస్తరిస్తామంటూ.. జగన్ ను కలిసి చెప్పుకున్నారట. మరొకరరు.. శ్రీకాకళహస్తిలో పాదరక్షల సెజ్ కోసం వచ్చారని చెబుతున్నారు. ఆ హాంకాంగ్ కంపెనీ పైనే చాలా అనుమానాలొచ్చాయి. ఈ తీరుతో.. ఏపీ పారిశ్రామికీకరణ పడకేసినట్లే. వ్యవసాయఆధారిత రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close