చైతన్య: కోడెల ఫర్నీచర్‌లానే జగన్ ఇంటి కిటికీలు..!

ప్రజాధనం ఖర్చు పెట్టిన ప్రతీ వస్తువు ప్రభుత్వానికే చెందుతుంది. ప్రైవేటు ఆస్తులకు మెరుగులు దిద్దడానికి సహజంగా… ప్రజాధనం వెచ్చించరు. ఒక వేళ చేయాల్సి వచ్చినా.. కిటికీలకు..బాత్‌రూమ్‌లకు.. ఇవ్వరు. కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. తాను సీఎంగా ఉన్నాను కాబట్టి… తన ఇంటింకి సంబంధించిన బిల్లులు .. వివిధ కారణాలు చూపుతూ.. కోట్లకు కోట్లు ఖజానా నుంచి విడుదల చేసుకున్నారు. ఇది కొత్త చర్చకు దారి తీస్తోంది.

ప్రభుత్వం మారిన తర్వాత జగన్‌పై కిటికీల కేసులు పెడతారా..?

అసెంబ్లీ ఫర్నీచర్‌ను కోడెల శివప్రసాదరావు వాడుకున్నారంటూ ప్రభుత్వం కేసు పెట్టింది. ఫర్నీచర్ తన వద్ద ఉందని.. తీసుకెళ్లమని ఆయన లేఖలు రాసినా.. కేసులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ఈ కోణంలో.. తర్వాత అంటే.. ప్రభుత్వం మారిన తర్వాత .. కొత్త ప్రభుత్వం..జగన్మోహన్ రెడ్డి స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూల్చి వేసిన ప్రజావేదిక ఉదంతంతో…ఎక్కువ మంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు. ఒక వేళ ఇంటిని కాకపోయినా.. ఇప్పుడు డబ్బులు మంజూరు చేసుకుని.. కొనుక్కున్న వాటినైనా ప్రభుత్వానికి దఖలు పర్చాల్సి ఉంటుంది. లేకపోతే..కోడెల శివప్రసాదరావుపై పెట్టినట్లుగా.. తదుపరి ప్రభుత్వం.. దొంగతనం కేసులు పెట్టుకోవడానికి కూడా..ప్రస్తుత ప్రభుత్వమే దారి చూపించింది. ఏ విధంగా చూసినా.. జగన్మోహన్ రెడ్డి సొంత ఇంటికి ప్రజాధనం కోట్లలో వినియోగించడం… ఇప్పుడు సంచలనం.. తర్వాత మహా సంచలనం అవడానికే ఎక్కువ అవకాశం కనిపిస్తోంది.

సీఎంకు అధికారిక నివాసం నిర్మించకుండా సొంత ఇంటికి సొబగులా..?

జగన్ ఇప్పుడు ఉంటున్న ఇల్లు ప్రభుత్వ ఆస్తి కాదు. ఓ రకంగా చెప్పాలంటే.. ఆయన సీఎం కాక ముందు కట్టించుకున్న ఇంటికి ఇప్పుడు బిల్లులు పెట్టి.. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మును విడుదల చేసుకుంటున్నారు. జగన్ ఇంటి కోసం మంజూరు చేసిన నిధులతో.. ముఖ్యమంత్రి కోసం… అమరావతిలో శాశ్వతమైన నివాసం నిర్మించవచ్చు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే.. హైదరాబాద్‌లోని బేగంపేటలో.. అలానే ఇల్లు నిర్మించారు. ఆ తర్వాత కేసీఆర్… మరో ఇల్లు నిర్మించారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి మాత్రం.. గత ఐదు నెలలుగా.. ఏదో ఓ వంకతో.. ఆ ఇంటికి నిధులు మంజూరు చేస్తూనే ఉన్నారు…కానీ శాశ్వత నివాసం నిర్మాణం ఆలోచన మాత్రం చేయడం లేదు. ఇది కచ్చితంగా ప్రజాధనం దుర్వినియోగం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..! పరిణామాలు అనుభవించాల్సిందే..!

జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులను ఐదు వందల కోట్ల రూపాయలుగా చూపించారు. అంటే ఇదంతా వైట్. ఇదే విషయాన్ని జాతీయ మీడియా కూడా ఎత్తి చూపుతోంది. ఇంత తెల్లధనం చూపించిన వ్యక్తి.. తన సొంత ఇంటి కోసం.. రూ. కోట్లకు కోట్లు ప్రజాధనం వెచ్చించడం ఏమిటన్న చర్చ పెట్టాయి. ఈ చర్చల్లో చాలా మంది.. అంత ఖర్చు పెట్టినందున.. ప్రభుత్వం మారిన తర్వాత వసూలు చేసుకోవచ్చన్న.. అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ అవకాశాన్ని కొట్టి పడేయలేం కూడా. కాదు.. కూడదంటే.. కోడెలపై పెట్టినట్లు దొంగతనం కేసులు పెట్టడానికి కూడా అవకాశం ఇప్పుడు ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close