చిరుకి నిఖిల్ `డాన్స్’ ట్రీట్‌

నిఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘అర్జున్ సుర‌వ‌రం’. ఈ శుక్ర‌వారం విడుదల కాబోతోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ చిన్న సినిమాకి ఆశీస్సులు అందించ‌డానికి చిరు పెద్ద మ‌న‌సు చేసుకుని రావ‌డంతో నిఖిల్ ఆనందానికి అవ‌ధుల్లేవు. అందుకే… మెగా డాన్స్ ట్రీట్ ఇచ్చాడు. చిరు సినిమాల్లోని సూప‌ర్ హిట్ పాట‌ల‌కు నిఖిల్ స్టేజీపై స్టెప్పులు వేశాడు. ముఠామేస్త్రీ, ఠాగూర్‌, సైరా చిత్రాల్లోని పాట‌ల‌కు నిఖిల్ చిందులు వేశాడు. చివ‌ర్లో వేదిక పై నుంచి కింద‌కి వ‌చ్చి… చిరుకి ఓ క‌త్తి బ‌హుమానంగా అందించాడు. ఆ క‌త్తిని ప్రేమ‌గా అందుకున్న చిరు… నిఖిల్‌ని ఆశీర్వ‌దించాడు. ఈ చిత్ర నిర్మాత ఠాగూర్ మ‌ధుకి చిరుకీ మంచి అనుబంధం ఉంది. ఠాగూర్ మ‌ధు కోస‌మే చిరు ఈ వేడుక‌కు విచ్చేసినా – నిఖిల్ త‌న స్టెప్పుల‌తో చిరుని మైమ‌రిపించాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close