ఎన్‌కౌంటర్‌పై “సుప్రీం” నిర్ణయంతో పోలీసులకు చిక్కులు..!

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే తెలిపారు. నియమితులయ్యే విశ్రాంత న్యాయమూర్తి ఢిల్లీలోనే ఉండి ఈ కేసును దర్యాప్తు చేసేలా చూస్తామన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ అనే ఇద్దరు న్యాయవాదులు గతంలోదాఖలు చేసిన పిల్‌పై సుప్రీం ఈ విచారణ చేపట్టింది. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు.

కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌‌ను ప్రతివాదులుగా చేర్చారు. విచారణ కోసం మాజీ జస్టిస్‌ పి.వి.రెడ్డిని సంప్రదించామని కానీ.. అందుకు ఆయన నిరాకరించారని చీఫ్ జస్టిస్ తెలిపారు. విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపే అంశంపై ఏమనుకుంటున్నారో సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై పూర్తి అవగాహనతో ఉన్నామని … జరుగుతున్న అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చీఫ్ జస్టిస్ ప్రకటించారు.

మరో వైపు తెలంగాణలో పర్యటించిన మానవ హక్కుల కమిషన్…, తాము సేకరించిన వివరాలన్నింటినీ… సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఎన్‌కౌంటర్‌కు గురైన నలుగురిలో ముగ్గురు మైనర్లన్న ప్రచారం జరుగుతోంది. దాంతో.. ఈ కేసు మరింత తీవ్ర తరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్‌కౌంటర్ విషయంలో ప్రజామోదం లభించినప్పటికీ..చట్టపరమైన ఆమోదం మాత్రం అంత తేలిగ్గా లభించే అవకాశం కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close