ఈ సినిమాని నాగ్ ప‌ట్టించుకోడా?

నాగ‌చైత‌న్య సినిమా అంటే నాగార్జున హ‌డావుడి మామూలుగా ఉండేది కాదు. అస‌లు త‌న‌కు సంబంధం లేక‌పోయినా ప్రెస్ మీట్లు పెట్టి మ‌రీ మాట్లాడేవాడు. ఎడిటింగ్‌రూమ్ లోనూ నాగ్‌దే హ‌డావుడి. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో నాగ్ హాజ‌రు త‌ప్ప‌ని స‌రి. స‌మంత‌, అఖిల్‌… వీళ్లంతా టంచ‌నుగా హాజ‌రైపోయేవారు.

అయితే `వెంకీ మామ‌`కి మాత్రం ఈ హ‌డావుడి ఏం క‌నిపించ‌డం లేదు. ఈ సినిమా గురించి నాగ్ ఒక్క‌సారి కూడా మాట్లాడ‌లేదు. క‌నీసం ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టింగు కూడా లేదు. ఈ సినిమాకి సంబంధించి రెండు పెద్ద ఫంక్ష‌న్లు జ‌రిగాయి. ప్రి రిలీజ్ వేడుక‌తో పాటు, మ్యూజిక‌ల్ నైట్అంటూ మ‌రో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ రెండింటికీ నాగ్ హాజ‌రు కాలేదు. స‌మంత కూడా రాలేదు. అఖిల్ సంగ‌తి స‌రే స‌రి. ‘ఇది ద‌గ్గుబాటి ఫ్యామిలీ సినిమా’ అని లైట్ తీసుకున్నారా? లేదంటే ‘ఈ సినిమా గురించి మాట్లాడేవాళ్లు ఎక్కువ‌మందే ఉన్నారు క‌దా..’ అంటూ ప‌ట్టించుకోలేదా? అనేదే అర్థం కావ‌డం లేదు. వెంకీతో నాగ్‌కి సంబంధాలు బాగానే ఉన్నాయి. ఈమ‌ధ్య ద‌గ్గుబాటి ఫ్యామిలీతో స‌మంత క‌లివిడిగానే ఉంటోంది. మ‌రి ఈ గ్యాప్ ఎందుకొచ్చిందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close