వ‌ర్మ‌కి మ‌రో క‌థ దొరికేసింది

క‌థ‌ల్లేక ద‌ర్శ‌కులంతా జుట్టు ప‌ట్టుకుంటుంటే – వ‌ర్మ మాత్రం భ‌లేగా ప‌ట్టేస్తుంటాడు. అస‌లు ఆయ‌న సినిమాలో క‌థే ఉండ‌ద‌నుకుంటారు గానీ, ఆయ‌న‌కు ఓ చిన్న పాయింటు చాలు. వ‌ర్మ ఫామ్ లో లేక‌పోవ‌డం, ఆయ‌న సినిమాల‌న్నీ వ‌రుస‌గా డిజాస్ట‌ర్లు అవ్వ‌డం అన్నీ ప‌క్క‌న పెడితే, వ‌ర్మ ఎప్పుడూ క‌థ కోసం దేవులాడుకోడు. క‌థ‌లే త‌న వెంట ప‌డ‌తాయి. ఇప్పుడు ఆయ‌న‌కు మ‌రో క‌థ దొరికింది.

వ‌ర్మ సినిమా `అమ్మ రాజ్యంలో – క‌డ‌ప బిడ్డ‌లు` ఈ రోజు విడుదలైంది. అస‌లు ఈ సినిమా బ‌య‌ట‌కు వ‌స్తుదా, రాదా?  అనే డౌట్ల మ‌ధ్య ఈ సినిమా రిలీజ్‌కి నోచుకోవ‌డం గొప్ప విశేష‌మే. ఈ సినిమాని ఆపాల‌ని చాలా మంది చూశార‌ట‌. త‌న వెనుకే కుట్ర‌లు ప‌న్నార్ట‌. గోతులు తీశార‌ట‌. వాళ్లంద‌రి ప‌నీ త్వ‌ర‌లోనే ప‌డ‌తా… అంటున్నాడు. ఈ సినిమాని ఆప‌డానికి ఎవ‌రెవ‌రు ప్ర‌య‌త్నించారో, వాళ్లంద‌రిపైనా కేసులు బ‌నాయిస్తానంటున్నాడు. వ‌ర్మ అవ‌న్నీ చేస్తాడో లేదో తెలీదు గానీ, త‌న సినిమా ఆప‌డానికి చేసే ప్ర‌క్రియ మొత్తం ఓ సినిమా తీస్తాడు. అది మాత్రం గ్యారెంటీ. ఓ సినిమాని ఆప‌డానికి కొంత‌మంది ప్ర‌య‌త్నించ‌డం, దాని వెనుక ఏం జ‌రిగిందో సినిమా తీయ‌డం… భ‌లే వింత‌గా ఉన్న క‌న్సెప్ట్‌. కాదేదీ ప్ర‌చారానికి అనర్హం అని న‌మ్మే వ‌ర్మ – కాదేదీ క‌థ‌కు అన‌ర్హం అనుకోకుండా ఎలా ఉండ‌గ‌ల‌డు..? 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close