సీఎం కేంద్రంపై నెడితే… రాష్ట్ర నేత‌లు సీఎంపై నెడుతున్నారు!

రాష్ట్ర స‌మ‌స్య‌ల్ని కేంద్రంపై నెట్టేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ మ‌ధ్య ప్ర‌య‌త్నిస్తున్నారు. కేంద్రం నిధులు ఇవ్వ‌లేద‌నీ, ఇచ్చుకుంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేదంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిలిచిపోయాయంటే కార‌ణం రాష్ట్ర వాటా ప‌న్నుల్ని కేంద్రం చెల్లించక‌పోవ‌డం అంటున్నారు. మ‌న ప‌థ‌కాల‌ను కేంద్రం కాపీ కొడుతోంది అంటున్నారు. నెపాన్ని కేంద్రంపై నెట్టేసి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తుంటే… భాజ‌పా కూడా అదే త‌ర‌హాలో రాష్ట్రంపై విమ‌ర్శ‌లు ప్రారంభించింది. వారి బాధ్య‌త‌, వారిచ్చిన మాట‌ల్ని త‌ప్పుతూ… త‌ప్పంతా రాష్ట్రానిదే అనే వాద‌న వినిపించ‌డం వాళ్లూ మొద‌లుపెట్టారు.

ప‌సుపు బోర్డు తెస్తామ‌ని ఎంపీ అర‌వింద్ మాట తప్పారంటూ రైతులు ఆందోళ‌న చేస్తున్నారు. ఎన్నిక‌ల ముందు ఇదే మాట చెప్పి ఓట్లేయించుకున్నార‌నీ, ఇప్పుడు బోర్డుకు మించింది ఇంకేదో తెస్తామ‌ని, అదేదో స్ప‌ష్టంగా చెప్ప‌క‌పోతే ఎలా న‌మ్మాల‌నేది రైతులు ప్ర‌శ్న‌. నిజానికి, ఈ అంశాన్ని తెరాస వాడుకుంటే.. రాజ‌కీయంగా నిజామాబాద్ జిల్లాలో రైతుల్ని త‌మ‌వైపు తిప్పుకునే అవ‌కాశం ఉంది. అయితే, ఆ ఛాన్స్ తెరాస‌కు ఇవ్వ‌కుండా ప‌సుపు రైతుల స‌మ‌స్య‌ల‌కు కేసీఆర్ స‌ర్కారే కార‌ణ‌మంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్. ప‌సుపు రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర రాక‌పోవ‌డానికి కేసీఆర్ కార‌ణ‌మ‌న్నారు. మ‌ద్ద‌తు ధ‌ర‌ను నిర్ణయిస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్రానికి ఎందుకు ప్ర‌పోజ‌ల్ పంపించ‌లేదంటూ ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. ప్రాంతీయ పంట‌ల మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌ను నిర్ణ‌యించి కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు పంపాల్సిన బాధ్య‌త‌ల రాష్ట్రాల‌కు ఉంటుంద‌న్నారు. రాష్ట్రం ప్ర‌తిపాద‌న పంపితే, వెంట‌నే అంగీకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంద‌న్నారు. మ‌ద్ద‌తు ధ‌ర నిర్ణ‌యించి, ప్ర‌పోజల్స్ త‌యారు చేయాలంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లేఖ రాస్తాన‌ని అర‌వింద్ చెప్పారు.

వాస్త‌వానికి, ప‌సుపు రైతుల‌కు బోర్డు తెప్పించి, ఆదుకుంటామ‌ని చెప్పి గెలిచారు అర‌వింద్. అయితే, దాన్ని కేంద్రం నుంచి ఆయ‌న సాధించుకోలేక‌పోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఆ నెపాన్ని నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న‌దీ ఇదే క‌దా! రాష్ట్రంలో పాల‌నా వైఫ‌ల్యాల‌కు త‌మ హ‌యాం కార‌ణం కాద‌నీ, కేంద్రానిదే త‌ప్పు అని వేలెత్తి చూపే ప‌నిలో ఉన్నారు. సీఎం వెర్సెస్ భాజ‌పా నేత‌లు ఇలా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం అవుతున్నారు. కేంద్రం, రాష్ట్రం.. ఇలా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల‌కు వారి వైఫ‌ల్యాల‌ను వాడుకుంటే, స‌మ‌స్య‌ల‌పై వాస్త‌వ రూపంలో ప‌రిష్కార మార్గం ఎక్క‌డి నుంచి వ‌స్తుందో తెలియ‌ని ప‌రిస్థితి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close