అమరావతిపై మరో కమిటీ..! “కోత” కోసం.!?

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేస్తున్న విన్యాసాలు సామాన్య ప్రజలను విస్మయానికి.. అధికార వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఇచ్చిన మాస్టర్‌ ప్లాన్‌ను.. ఫైనాన్షియల్ ప్లాన్‌ను.. పక్కన పడేసి.. అదే అమరావతిని ఎలా… తీర్చిద్దాల్లో కమిటీల మీద కమిటీలు వేస్తున్నారు. మొన్నటికి మొన్న..జీఎన్‌రావు అనే మాజీ అధికారి నేతృత్వంలో నిపుణుల కమిటీ వేసిన ఏపీ సర్కార్.. ఆ కమిటీని బూచిగా చూపిస్తూ… వస్తోంది. ఆ కమిటీ ఎక్కడ రాజధాని అంటే.. అక్కడే రాజధాని అంటూ బొత్స సత్యనారాయణ.. అడిగిన వారికీ.. అడగని వారికి కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో మరో కమిటీ అమరావతి మీద.. అధ్యయనానికి రంగంలోకి దిగింది. “రూర్కీ ఐఐటీ” నుంచి ఈ నిపుణుల కమిటీ వస్తోందట..!

అమరావతి పరిశీలనకు వస్తున్న “రూర్కీ ఐఐటీ” కమిటీ ఏం చేస్తుందంటే.. అమరావతి నిర్మాణాలను ఎంత వరకు కుదించవచ్చు అనేది పరిశీలన చేస్తుందట. ఇప్పటి వరకు అమరావతిలో చేపట్టిన పనులను పరిశీలించి ఎంత వరకు పురోగతి ఉందో, ఏ మేరకు కుదించవచ్చో, ప్లాన్‌లో ఏ మేరకు మార్పులు చేయవచ్చో ఈ నిపుణులు తేల్చుతారట. సుమారు నెల, నెలన్నర రోజుల్లో దీనిపై నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. సాధారణం ప్రభుత్వం వేటిని నిలిపివేయాలనుకుంది.. వేటిని కట్టాలనుకుంటోందో..ముందే వారికి చెబుతారు కాబట్టి.. ఆ ప్రకారమే నివేదిక వస్తోంది.

అమరావతి విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న వైఖరి సాధారణ ప్రజలనే కాదు… నిపుణులనూ విస్మయానికి గురి చేస్తోంది. కమిటీల మీద కమిటీలు.. అదే పనిగా.. అమరావతిపై వ్యతిరేకప్రచారం చేయాల్సిన అవసరం ఏముందన్నది ప్రశ్న. రాజధానిని మార్చుకునే వెసులుబాటు ఉంటే మార్చుకోవచ్చు కానీ.. ఇలా సొంత రాష్ట్ర రాజధానిని ఎప్పటికప్పుడు డిగ్రేడ్ చేస్తూ.. అధికారిక నిర్ణయాలు తీసుకోవడం.. పొరుగు రాష్ట్రాల వారిని సైతం నివ్వెర పరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close